Asianet News TeluguAsianet News Telugu

తిరుమల తిరుపతి దేవస్థానాలకు కోటి రూపాయల విరాళమిచ్చిన ముస్లిం దంపతులు

Chennai Muslim couple: చెన్నైలోని తిరుమల తిరుపతి దేవస్థానాలకు ముస్లిం దంపతులు కోటి రూపాయల విరాళం ఇచ్చారు. అబ్దుల్ ఘనీ ఆలయానికి విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2020లోనూ ఆయ‌న కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆలయ ప్రాంగణంలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడానికి మల్టీ-డైమెన్షనల్ ట్రాక్టర్-మౌంటెడ్ స్ప్రేయర్‌ను విరాళంగా ఇచ్చాడు.
 

Chennai : Muslim couple donated Rs.1 crore to the Tirumala Tirupati Devasthanam
Author
First Published Sep 21, 2022, 10:29 AM IST

Tirumala Tirupati Devasthanam: చెన్నైలోని తిరుమల తిరుపతి దేవస్థానాలకు ముస్లిం దంపతులు కోటి రూపాయల విరాళం ఇచ్చారు. చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్ ఘనీ అనే ముస్లిం దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన రీతిలో కోటి రూపాయల విరాళం అందించారు. ఈ విరాళంలో కొత్తగా నిర్మించిన పద్మావతి విశ్రాంతి గృహానికి సంబంధించిన రూ.87 లక్షల ఫర్నిచర్-పాత్రలు, అలాగే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు చెల్లించిన‌ రూ.15 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు ఈ దంప‌తులు బుధ‌వారం నాడు చెక్కును అందించారు.


ఆ ముస్లిం కుటుంబ సభ్యులు త‌మ విరాళాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డికి  చెక్కు రూపంలో అందించారు. విరాళం చెక్కును లాంఛనంగా స్వీకరించిన ఆయ‌న‌.. వారి దాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీటీడీ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు అబ్దుల్ ఘనీ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉండగా, సోమవారం తిరుమల ఆలయంలో 67,276 మంది భక్తులు వేంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేశారు.టీటీడీకి రూ. 5.71 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. కొండ ఆలయంలో దర్శనం కోసం సుమారు 12 గంటల సమయం మంగళవారం ఉదయం నాటికి సుమారుగా అంచనా వేయబడింది.

కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ గ‌త శుక్రవారం తిరుమల ఆలయానికి రూ.1.5 కోట్ల విరాళం అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ కొండ పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు చేసిన అనంతరం అంబానీ తిరుమలలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఏవీ ధర్మారెడ్డికి డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందజేశారు.

ముఖేష్ అంబానీ తిరుమ‌లేషున్ని దర్శనం చేసుకుని ఆలయ పూజారులు నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు సీ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబానీ, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో పాటు ఇతర RIL అధికారులు శుక్రవారం తెల్లవారుజామున తిరుమ‌ల కొండ‌కు చేరుకున్నారు. అంతకుముందు, వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తుడైన అంబానీ 2010లో తిరుమల ఆలయానికి రూ. 5 కోట్లను విరాళంగా అందించారు. ఆ సమయంలో, గర్భగుడి కోసం టీటీడీ కొనసాగుతున్న రూ. 100 కోట్ల గర్భగుడి బంగారు పూత ప్రాజెక్టును తీర్చడానికి ఈ విరాళాన్ని అందించినట్లు ఆలయ వర్గాలు పీటీఐకి తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios