Asianet News TeluguAsianet News Telugu

2.17 నిమిషాల పాటు నీటిలో.. 6 రూబిక్స్ పజిల్స్ పూర్తి: గిన్సిస్ రికార్డుల్లోకి చెన్నై యువకుడు

గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలని ఎంతోమంది కల. ఇందుకోసం ఎన్నో సాహసాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి నీళ్లలో మునిగి రూబిక్స్ పజిల్‌ను పూర్తి చేశాడు.

chennai man solve rubiks cube puzzle in underwater and wins guinness record
Author
Chennai, First Published Aug 27, 2020, 5:04 PM IST

గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాలని ఎంతోమంది కల. ఇందుకోసం ఎన్నో సాహసాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి నీళ్లలో మునిగి రూబిక్స్ పజిల్‌ను పూర్తి చేశాడు. సాధారణంగా రూబిక్స్ క్యూబ్ పజిల్‌ను పూరించడం అంత సులభం కాదు.

ఏళ్ల తరబడి అభ్యాసం ఉంటే కానీ దానిని పూర్తి చేయలేరు. దీనినే తన గిన్నిస్ రికార్డుకు సాధనంగా మార్చుకున్న చెన్నైకి చెందిన ఇళయరామ్ శేఖర్ తను అనుకున్నది సాధించాడు. 2.17 నిమిషాల పాటు నీళ్లలో ఉండి మొత్తం 6 రూబిక్స్ పజిళ్లను పూర్తి చేశాడు.

ఇందుకోసం ఏకంగా రెండేళ్ల పాటు కఠోర సాధన చేశాడు. తద్వారా గతంలో ఐదు రూబిక్స్‌ పేరిట వున్న రికార్డును బద్ధలు కొట్టాడు. ఇళయరామ్ నీటిలో పజిల్స్‌ను పూర్తి చేసిన వీడియోను గిన్నిస్ బుక్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది.

ఆగస్టు 22న ఈ వీడియోను షేర్ చేయగా భారీగా వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై స్పందించిన నెటిజన్లు తాము మామూలుగానే రూబిక్స్ క్యూబ్ పజిల్‌ను సాల్వ్ చేయలేననని.. ఈ కుర్రాడు మాత్రం నీళ్లలోనే చేస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios