Asianet News TeluguAsianet News Telugu

స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. రక్తపు బ్యాండెడ్ వచ్చింది

ప్రముఖ ఫుడ్ డెలవరీ యాప్.. స్విగ్గీ మరోసారి వార్తల్లో నిలిచింది.  క్వాలిటీ ఫుడ్ అందించడంలో.. స్విగ్గీ మరోసారి విఫలమైందనే వార్తలు వినపడుతున్నాయి.  

Chennai man finds blood-stained bandage in food delivered from Swiggy
Author
Hyderabad, First Published Feb 13, 2019, 12:43 PM IST

ప్రముఖ ఫుడ్ డెలవరీ యాప్.. స్విగ్గీ మరోసారి వార్తల్లో నిలిచింది.  క్వాలిటీ ఫుడ్ అందించడంలో.. స్విగ్గీ మరోసారి విఫలమైందనే వార్తలు వినపడుతున్నాయి.  అసలు మ్యాటర్ లోకి వెళితే..  చెన్నైకి  చెందిన బాలమురగన్ అనే ఓ వ్యక్తి ఇటీవల స్విగ్గీలో ఫుడ్ డెలివరీ చేశాడు.

చాప్ ఎన్ స్టిక్ అనే రెస్టారెంట్ నుంచి స్విగ్గీ ద్వారా నూడిల్స్ ఆర్డర్ చేశాడు. వచ్చిన పార్శిల్ విప్పి.. తినడం మొదలుపెట్టాడు. సగం తిన్నాక.. అందులో అతనికి రక్తంతో కూడా బ్యాండెడ్ కనిపించింది. అది చూసి  కస్టమర్  ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే దానిని ఫోటో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

తాను ఆర్డర్ చేసిన నూడుల్స్‌లో రక్తంతో నిండిన బ్యాండేజ్ కనిపించినట్టు వెంటనే స్విగ్గీ యాప్ కస్టమర్ సర్వీస్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అయనప్పటికీ స్విగ్గీ స్పందించలేదని బాలమురుగన్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్విగ్గీ స్పందించకపోవడంతో రెస్టారెంట్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే వారు కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని, ఆర్డర్ మాత్రం రీప్లేస్ చేస్తామని చెప్పారని బాలమురుగన్ వాపోయాడు.

Follow Us:
Download App:
  • android
  • ios