మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ కుమార్(Senthil Balaji)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను 8 రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి అప్పగిస్తూ చెన్నై మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది.
మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు అతని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీని జూన్ 23 వరకు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో పట్టుబడిన తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెన్నై మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. \
ఈ సమయంలో ఆయనను 8 రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి అప్పగిస్తూ చెన్నై మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది. అతడిని జూన్ 23 వరకు ఈడీ కస్టడీకి పంపింది. అనంతరం తిరిగి తమ ముందు హాజరుపరచాలని ఈడీకి స్పష్టం చేసింది చెన్నై మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు. అరెస్టయిన తరువాత ఆస్వస్థతకు గురైన సెంథిల్ బాలాజీని హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కావేరే ఆసుపత్రిలో చేర్చారు.ఈ నేపథ్యంలోనే అతన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎస్.అలీ ముందు హాజరు పరిచారు. బాలాజీ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన అనంతరం ఆయన కస్టడీపై ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఆదేశాలిచ్చారు.
మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించడానికి ED సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ బాలాజీకి కూడా సమన్లు జారీ చేసింది. వచ్చే వారం అతడిని విచారించనున్నారు. అన్నదమ్ములిద్దరికీ ఈడీ కస్టడీ పెరగడంతో తమిళనాడు ప్రభుత్వానికి కూడా కష్టాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946 ప్రకారం తమిళనాడు హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో.. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా కేసును విచారించే ముందు సీబీఐకి అనుమతి ఇచ్చారు. తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన తరుణంలో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
