ఓ జంట అరవై అడుగుల లోతు సముద్రగర్భంలో ఒక్కటై నూతనజీవితానికి శుభారంభం పలికారు. తమిళనాడులోని చెన్నైలో ఓ జంటల జలచరాల నడుమ పెళ్లి చేసుకుని ప్రత్యేకంగా నిలిచారు.  చెన్నై శివార్లలోని నీలాంగరై సముద్ర తీరంలో సోమవారం ఈ వెరైటీ పెళ్లి జరిగింది. 

తిరువణ్ణామలైకి చెందిన చిన్నదురై చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కోయంబత్తూరుకు చెందిన శ్వేతతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అయితే అందరిలా కాకుండా తమ పెళ్లి వెరైటీగా చేసుకోవాలనుకున్నారీ జంట. దీనికోసం తమకు అందుబాటులో ఉన్న సముద్రాన్ని ఎంచుకున్నారు. 

సోమవారం ఉదయం పెళ్లి బట్టలతో సముద్రంలోకి వెళ్లారు. ఆ తరువాత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, ఆక్సీజన్ ధరించి 60 అడుగుల లోతుకు చేరుకున్నారు. అక్కడ నీటిలోనే పూలదండలు మార్చుకున్నారు. చుట్టూ ఉన్న జలచరాల నడుమ ఒక్కటయ్యారు. 

ఈ పెళ్లి గురించి చిన్నదురై మాట్లాడుతూ ముద్రగర్భంలో పేరుకుపోతున్న చెత్త గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తామిద్దరూ ఈ సాహసం చేశామని చెప్పుకొచ్చాడు.