సర్ ప్రైజ్ అని చెప్పి.. సూసైడ్ చేసుకుంది

Chennai-based techie commits suicide by jumping off ninth floor
Highlights

9వ అంతస్థు నుంచి దూకి ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య


కుటుంబసభ్యులందరికీ ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నానని చెప్పి.. ఓ ఐటీ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రియాంక(27) చైన్నైలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇంట్లోవారు ఆమెకు పెళ్లి చేయాలని అనుకున్నారు. గత నెల ఆమెకు ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4.45 లకు ఆమె దొరైపాక్కం ప్రాంతంలోని తొమ్మిదో అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనంతా అక్కడి  సీసీకెమెరాలో రికార్డయ్యాయి. 

వెంటనే ఆమె సహోద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఘటనకు ముందు ఆమె తన బంధువుకు ఫోన్ చేసి మీకో సర్‌ప్రైజ్‌ ఇస్తా అని చెప్పింది. ఆ వివాహం చేసుకోవడం ఇష్టం లేని కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది. ‘ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. వ్యక్తిగత కారణాలు దీనికి పురికొల్పి ఉంటాయి. పోస్ట్ మార్టం అనంతరం ఈ దర్యాప్తును కొసాగిస్తాం. ప్రస్తుతం ఆమె కంప్యూటర్‌ను పరిశీలించాల్సి ఉంది’ అని పోలీసులు మీడియాకు వెల్లడించారు.
 

loader