చితిపైన పడుకోబెట్టగానే లేచి కూర్చోంది.. కొద్దిసేపటికే ఇలా...

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 10, Sep 2018, 12:20 PM IST
chatra girl wake on pyre died soon after
Highlights

జార్ఖండ్‌లోని ఛత్రాలోని సోఖా ప్రాంతంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకొంది. 


ఛత్రి: జార్ఖండ్‌లోని ఛత్రాలోని సోఖా ప్రాంతంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకొంది. చనిపోయిందనుకొని భావించిన ఓ బాలిక చితిమీద పడుకోబెట్టగానే ఆమె లేచి కూర్చొంది. దీంతో ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆ ఆనందం ఎంతోసేపు లేదు.

జార్ఖండ్‌లోని ఛత్రాలోని సోఖా ప్రాంతంలో అమర్‌చౌదరి కి ఓ కూతురు ఉంది. ఆమె పేరు క్రాంతికుమారి. ఆమె వయస్సు 16 ఏళ్లు. రాత్రి పడుకొన్న తర్వాత క్రాంతి కుమారిని పాము కాటేసింది. 

అయితే ఉదయంపూట క్రాంతి కుమారి లేవలేదు. అయితే ఆమె చనిపోయిందని భావించారు.  కర్మకాండలు చేసేందుకు ఏర్పాట్లుచేశారు. స్మశానికి  డెడ్ బాడీని తీసుకెళ్లారు. చితి మీద ఆ బాలికను పడుకోబెట్టగానే ఆమె లేచి కూర్చోంది.

చితి మీద ఆ బాలికను పడుకోబెట్టగానే ఆ బాలిక లేవగానే  కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేవు. వెంటనే కుటుంబసభ్యులు అంబులెన్స్ ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు మెరుగైన చికిత్స కోసం మగథ్ మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. ఆమెను అక్కడకు తరలిస్తున్న క్రమంలోనే ఆ బాలిక చనిపోయింది. అయితే బాలికకు పాము కరిచిందని సకాలంలో ఆమెను ఆసుపత్రిలోకి చేర్పిస్తే  బతికే అవకాశం ఉండేదని వైద్యులు చెప్పారు.

loader