Asianet News TeluguAsianet News Telugu

ఓ వైపు వర్షం.. మరోవైపు  మంచు.. నిలిచిపోయిన ఛార్‌దామ్ యాత్ర   

కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లలో భారీగా మంచు కురుస్తోంది. అదే సమయంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షం కురవడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. 

Char Dham Yatris Stopped By J&K Police At Srinagar krj
Author
First Published Apr 30, 2023, 3:21 PM IST

ఛార్‌దామ్ యాత్ర నిలిచిపోయింది. కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లలో ఓ వైపు వర్షం, మరోవైపు  మంచు కురుస్తోంది. అదే సమయంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్డుపై పెద్ద పెద్ద రాళ్లు పేరుకుపోయాయిదీంతో చార్ ధామ్ యాత్ర అర్థరాత్రి నిలిచిపోయింది. ప్రయాణికులు సమీప నగరాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్‌ఐటీ ఉత్తరాఖండ్ సమీపంలో మరియు బద్రీనాథ్ బస్టాండ్ సమీపంలో చార్ ధామ్ యాత్రికులు ఆగిపోతున్న చోట చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దీంతో  యాత్రను తాత్కాలికంగా నిలిచిపోయింది. 

గత కొన్ని రోజులుగా కేదార్‌నాథ్ , బద్రీనాథ్‌లలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు కురవడం, మంచు పడటం, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరిగాయి. ముందుజాగ్రత్తగా ప్రయాణికులను ముందుకు వెళ్లకుండా నిలిపివేస్తున్నారు.మరోవైపు శ్రీనగర్ చేరుకున్న ప్రయాణికులకు శ్రీనగర్ లోనే బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వాతావరణం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు తమ ప్రయాణాన్ని నిలిపివేయాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. 

ప్రతికూల వాతావరణం కారణంగా చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో భారీ పర్వత శిధిలాలు రహదారిపై పడ్డాయి. దీని కారణంగా చమోలి ప్రాంతంలోని కొండ నుండి వచ్చిన శిధిలాల కారణంగా బద్రీనాథ్ హైవే మూసివేయబడింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, యూపీ, రాజస్థాన్ సహా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి చార్ ధామ్ వెళ్లే యాత్రికుల ఇబ్బందులు పడుతున్నారు. 

శ్రీనగర్ గర్వాల్‌లోని ఎన్‌ఐటీ ఉత్తరాఖండ్ సమీపంలో, బద్రీనాథ్ బస్టాండ్ సమీపంలో చార్ ధామ్ యాత్రికులు ఆపేస్తున్నారని, ఆన్‌లైన్‌లో బస చేసిన వారిని రుద్రప్రయాగ్‌కు తరలించేందుకు అనుమతిస్తామని ఎస్‌హెచ్‌వో శ్రీనగర్ రవి సైనీ తెలిపారు. కానీ ప్రయాణికులు మాత్రం బుకింగ్‌ చేసుకోలేదు. వారిని సమీపంలోని శ్రీనగర్‌లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీనగర్‌లో బస చేసేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పోలీసులు చెబుతున్నారు. వాతావరణం క్లియర్ అయిన తర్వాత, ప్రతి ఒక్కరూ తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చని సూచించారు. 

అంతకుముందు శనివారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం యాత్రికులు కోవిడ్-19తో సహా అన్ని వైద్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే తమ తీర్థయాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్‌ఓపిని జారీ చేసిందని, ఈ ఏడాది తీర్థయాత్ర చేపట్టే వారు దానిని పాటించాలని ముఖ్యమంత్రి అన్నారు.

పెరుగుతున్న ప్రమాదాలు

కేదార్‌నాథ్ ధామ్‌లో గత 12 రోజులుగా అడపాదడపా మంచు కురుస్తోంది. ఈ రోజు ఉదయం (ఏప్రిల్ 30)వాతావరణం మరింత దారుణంగా మారింది. దీంతో ప్రతికూల వాతావరణంపై హెచ్చరిక కూడా జారీ చేశారు. ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం పరిస్థితులు ఏర్పాడ్డాయి. వరుసగా వర్షం, మంచు కురుస్తుండటంతో యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

9 భాషల్లో సలహా జారీ 

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల కోసం వాతావరణ శాఖ 9 భాషల్లో సలహాలు జారీ చేసింది. ఉత్తరాఖండ్ సర్కార్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ప్రయాణాన్ని ప్రారంభించాలని యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. కేదార్‌నాథ్‌లోనూ మంచు కురుస్తున్న దృష్ట్యా రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం ప్రయాణికులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ ధామ్ యాత్రకు సంబంధించి 9 భారతీయ భాషలలో (తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ మరియు ఒడియా) సలహాలను జారీ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios