పంజాబ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ హెలికాప్టర్ కు విమానయాన శాఖ అనుమతి నిరాకరించింది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చండీగడ్ లో నో ఫ్లై జోన్ విధించింది. దీంతో సాక్షాత్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ కూ నో చెప్పింది. ఇది వివాదాస్పదంగా మారుతోంది...
పంజాబ్ : పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి Charanjit Singh Channi హెలికాప్టర్ కు విమాన శాఖ అధికారులు బ్రేక్ వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా చండీగఢ్లో నో ఫ్లై జోన్ విధించడంతో సీఎం చన్నీ Helicopter ను టేకాఫ్ చేయడానికి అధికారులు అనుమతించలేదు. కాంగ్రెస్ అధినేత Rahul Gandhi ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం చన్నీ Punjabలోని హోషియార్పూర్ కు హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ ను హోషియార్పూర్ లో ల్యాండ్ చేయడానికి అనుమతించారు.
మరోవైపు జలంధర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని Modi ప్రసంగిస్తున్నారు. పంజాబ్ సీఎం చన్నీ hoshiarpur రావడానికి హెలికాప్టర్ను అనుమతించకపోవడంపై కాంగ్రెస్ నాయకులు Sunil Jakhar ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీ శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి-పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమి నుంచి ఎదుర్కొంటుంది.
ఇదిలా ఉండగా, పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనవరి 13న ప్రధానమంత్రి narendra modiని హత్య చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని అసోమ్ ముఖ్యమంత్రి Himanta Bishwa Sharma ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి Charanjit Singh Channi ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని పర్యటనలో Security failureపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు.
‘ప్రధానమంత్రిని murder చేసేందుకు congress పార్టీ అధిష్టానం, పంజాబ్ సీఎం కుట్ర పన్నినట్లు లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ కుట్రలో భాగమైన సీఎంను అరెస్టు చేయాలి’ అని బిశ్వ శర్మ అన్నారు. జనవరి 5న పంజాబ్లో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర పోలీసులలకు జనవరి 2వ తేదీనే నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని... ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీఎం హిమంత ఆరోపించారు.
ఓ టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి అని చెప్పారు. ఈ ఘటన తర్వాత కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు సైతం ఈ కుట్ర గురించి వారికి ముందే తెలుసు అన్నట్లుగా ఉన్నాయన్నారు. పంజాబ్లో ఫిరోజ్పూర్ జిల్లాకు ప్రధాని మోదీ వెళుతుండగా ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించడంతో ఆయన వాహనశ్రేణి 20 నిమిషాలపాటు ఫ్లై ఓవర్ పై చిక్కుకుపోయింది. దీంతో ఆయన బహిరంగ సభ సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండా వెనుతిరిగారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. భద్రత వైఫల్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకన్న భద్రతా వైఫల్యంపై విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఇందు మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విచారణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు, పంజాబ్ పోలీసులు విచారణలో భాగం కానున్నారని వెల్లడించింది.
