బెంగుళూరు: పెళ్లికి కొన్ని గంటల ముందే వరుడు జంపయ్యాడు. దీంతో వధువు కుటుంబసభ్యులు షాకయ్యారు. 

పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులు, స్నేహితులు వచ్చి పెళ్లి మంటపం సందడిగా ఉంది.ఈ సమయంలో  వరుడు కన్పించకపోవడం కలకలం రేపింది ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కర్ణాటకలోని చిక్ మంగుళూరు తాలుకాలోని సింధు, నవీన్ అనే ఇద్దరికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. జనవరి 5వ తేదీన పెళ్లి చేయాలని ముహుర్తం పిక్స్ చేశారు. 

పెళ్లికి ఇరుకుటుంబాలు ఏర్పాట్లు చేసుకొన్నాయి.రెండు కుటుంబాల నుండి బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు విందు కూడా చేసుకొన్నారు. కొన్ని గంటల్లోనే పెళ్లి జరిగే సమయానికి పెళ్లి కొడుకు నవీన్ పెళ్లి జరిగే ప్రాంతం నుండి అదృశ్యమయ్యాడు. పెళ్లి కొడుకు కోసం ఎంత వెదికినా సమాచారం దొరకలేదు.

నవీన్  మరో యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను కాదని సింధును వివాహనికి ఒప్పుకొన్నాడు. అయితే ఈ పెళ్లిని ఆపేస్తానని ప్రియురాలు నవీన్ ను బెదిరించడంతో భయపడి ఆయన పెళ్లి మండపం నుండి పారిపోయాడు. 

వివాహ సమయానికి పెళ్లి కొడుకు లేకపోవడంతో సింధు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఈ పెళ్లి చూసేందుకు వచ్చిన చందు అనే యువకుడు సింధును పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. దీంతో అదే ముహుర్తానికి సింధును చందును పెళ్లి చేసుకొన్నాడు.