చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌కు సంబంధించి ఇస్రో మరో వీడియోను విడుదల చేసింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై రోవర్ కదలికలను బెంగళూరులోని ఇస్రో సెంటర్‌కు ఎప్పటికప్పుడు పంపిస్తోంది ల్యాండర్ కెమెరా.
చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌కు సంబంధించి ఇస్రో మరో వీడియోను విడుదల చేసింది. వీడియోలో చంద్రుడి ఉపరితలంపై ర్యాంప్‌ను ల్యాండర్ వదులుతున్న దృశ్యాలు వున్నాయి. ర్యాంప్‌తో పాటు సోలార్ ప్లానెట్ రిలీజ్ అయ్యాయి. చంద్రుని దక్షిణ ధ్రువంపై రోవర్ కదలికలను బెంగళూరులోని ఇస్రో సెంటర్‌కు ఎప్పటికప్పుడు పంపిస్తోంది ల్యాండర్ కెమెరా.
కాగా.. జాబిల్లిపై పరిశోధనల జరిపేందుకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగింది. చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3లో ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ తన పనిని కూడా ప్రారంభించేసింది.
అంతకుముందు ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి అడుగుపెట్టిన వీడియోను తాజాగా ఇస్రో విడుదల చేసింది. ఇస్రో షేర్ చేసిన వీడియోలో.. ల్యాండర్ నుంచి రోవర్ జారుకుంటూ జాబిల్లి ఉపరితలంపైకి చేరింది. ఆగస్టు 23న ల్యాండర్ ఇమేజర్ కెమెరా ఈ దృశ్యాలను చిత్రీకరించినట్టుగా పేర్కొంది. 14 రోజులపాటు చంద్రుడిపై పరిశోధనలు జరుపనుంది. ఇక, జాబిల్లి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి గుట్టు విప్పేందుకు పరిశోధనలను ప్రారంభించాయి. అయితే వాటి జీవితకాలం ఒక లూనార్ డే ( భూమిపై 14 రోజులకు సమానం) మాత్రమేనని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది.
