జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా దిగాలని కోరుతూ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న ప్రఖ్యాత మహాకాళేశ్వర్ ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భస్మ హారతి ఇచ్చారు. చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

చంద్రయాన్ -3 విజయవంతం కావాలని భారతీయ పౌరులతో పాటు ప్రపంచం మొత్తం ఆకాక్షింస్తోంది. దీని కోసం భారత్ లోని అనేక చోట్ల ప్రజలు తమకు ఇష్టమైన దైవాలను పూజిస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో విక్రమ్ ల్యాండర్ ను విజయవంతంగా చంద్రుడిపై దిగాలని ప్రార్థిస్తూ ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయంలో బుధవారం ప్రత్యేక భస్మ హారతి నిర్వహించారు. 

మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయానికి బుధవారం ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జాతీయ జెండాలు, ఇస్రో, చంద్రయాన్ -3 ఫొటోలు పట్టుకొని పూజలో పాల్గొన్నారు. హరతి ఇచ్చారు. చంద్రయాన్-3 విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. పూజరులు ప్రత్యేక భస్మ హారతి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ విడుదల చేసింది.

Scroll to load tweet…

అలాగే చంద్రయాన్ - 3 చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని ముస్లింలు లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో సోమవారం నమాజ్ చేశారు. మూన్ విషన్ విజయం సాధించాలని ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ‘ఏఎన్ఐ’ విడుదల చేసింది. అందులో భారత మూన్ మిషన్ కోసం ముస్లింలు ప్రార్థిస్తున్నారు. 

ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ఆగస్టు 23 (బుధవారం) సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్-3 కార్యక్రమంపైనే ఉంది. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా పాల్గొననున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రధాని మోడీ అక్కడి నుంచే ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో జరుగుతున్న 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని అక్కడికి వెళ్లారు. 

కాగా.. చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలోకి 41 రోజుల ప్రయాణం కోసం చంద్రయాన్ -3 మిషన్ ను లాంచ్ వెహికల్ మార్క్ -3 (ఎల్ వీఎమ్ -3) రాకెట్ ద్వారా జూలై 14 న ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే అమెరికా, చైనా, పూర్వపు సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ టెక్నాలజీపై పట్టు సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది.