Chandrayaan 3: భార‌త చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా ప్రజ్ఞాన్ మూన్ రోవర్ తొలిసారిగా తన మాతృ నౌక విక్రమ్ ల్యాండర్ ను ఫొటో తీసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగస్టు 30 బుధవారం విక్రమ్ రెండు నలుపు-తెలుపు చిత్రాలను విడుదల చేసింది. చంద్రయాన్ -3 మిషన్ ల్యాండర్ ధూళితో కప్పబడిన చంద్రుడి ఉపరితలంపై కాళ్ళపై నిలబడినట్లు ఆ చిత్రాలు చూపిస్తున్నాయి.  

India's Chandrayaan-3 moon rover Pragyan snaps: చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ మూన్ రోవ‌ర్ విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఫొటోల‌ను తీసింది. చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ 15 మీటర్ల దూరం నుంచి విక్రమ్ ల్యాండర్ చిత్రాలను తీయ‌గా, భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ఆ అద్భ‌త ఫొటోలు సోష‌ల్ మీడియాలో త‌న అధికారిక అకౌంట్ నుంచి షేర్ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే.. భార‌త్ చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా ప్రజ్ఞాన్ మూన్ రోవర్ తొలిసారిగా తన మాతృ నౌక విక్రమ్ ల్యాండర్ ను ఫొటో తీసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగస్టు 30 బుధవారం విక్రమ్ రెండు నలుపు-తెలుపు చిత్రాలను విడుదల చేసింది. చంద్రయాన్ -3 మిషన్ ల్యాండర్ ధూళితో కప్పబడిన చంద్రుడి ఉపరితలంపై కాళ్ళపై నిలబడినట్లు ఆ చిత్రాలు చూపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు రోవర్ సుమారు 15 మీటర్ల దూరం ప్రయాణించినప్పుడు తీసిన ఈ చిత్రాలను భారత అంతరిక్ష సంస్థ షేర్ చేసింది.

'సరిహద్దులు దాటి, మూన్ స్కేప్స్ దాటి.. మూన్ స్పేస్ లో భారత మహారాజుకు హద్దులు లేవు' అంటూ సోషల్ మీడియా వేదికగా ఇస్రో ఓ పోస్ట్ చేసింది. సహ ప్రయాణికుడు ప్రజ్ఞాన్ మరోసారి విక్రమ్ ను స్నాప్ లో బంధించాడు! భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటలకు 15 మీటర్ల దూరం నుంచి ఈ ఐకానిక్ ఫోటోను తీశాడు అంటూ పేర్కొంటూ సంబంధిత ఫొటోల‌ను పంచుకుంది. 

Scroll to load tweet…

కాగా, ప్రజ్ఞాన్ రోవర్ ముందు భాగంలో రెండు నావిగేషన్ కెమెరాలను అమర్చారు. లాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ (ఎల్ఈఓఎస్) అభివృద్ధి చేసిన ఈ కెమెరా చంద్రుడి ఉపరితలం ఉన్న ఉత్తమ కెమెరాల్లో ఒకటిగా చెబుతారు. చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం ఎక్కడ ఉందనే వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ.. ఈ ఫొటోతో పాటు చంద్రయాన్ 3కి సంబంధించిన కోఆర్డినేట్లను కూడా ఇస్రో షేర్ చేసింది. ఇది 69.373 S, 32.319 E, భారత అంతరిక్ష సంస్థ ద్వారా ప్లాన్ చేయబడిన 4.2 S, 4.69 E వద్ద 367621 కిలోమీట‌ర్లు x 32.348126 కిలోమీట‌ర్లు ఉద్దేశిత ల్యాండింగ్ పాయింట్ కు దగ్గరగా ఉంది.