చంద్రయాన్-2, లైవ్ బ్లాగ్: శ్రీహరికోట నుంచి చంద్రుడి దాకా ఇదీ జరిగింది

chandrayaan 2 journey

1:48 PM IST

ఆర్బిటర్ నుండి విడిపోయిన ల్యాండర్

సెప్టెంబర్ 2వ తేదీని చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా వేరుపడింది. మధ్యాహ్నం సరిగ్గా 1.15 గంటలకు ల్యాండర్, ఆర్బిటర్ నుంచి విడిపోయి చంద్రునికి 119*127 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యకు చేరింది. బెంగళూరులోని ఇస్రో  మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

1:42 PM IST

మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

ఆగస్టు 28న చంద్రయాన్-2 వ్యోమనౌకను మూడో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.  బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి బుధవారం ఉదయం 9:04 గంటల సమయంలో ఆన్‌బోర్డ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సాయంతో అందులోని ధ్రవ ఇంధనాన్ని 1190 సెకన్లపాటు మండించి ఈ ఉపగ్రహాన్ని చంద్రుని రెండో కక్ష్య నుంచి మూడో కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియతో వ్యోమనౌక చంద్రునికి 179 కి.మీ. దగ్గరగా, 1412 కి.మీ. దూరంగా ఉన్న కక్ష్యలోకి చేరి జాబిల్లికి మరింత చేరువవుతుంది. 

1:41 PM IST

చంద్రబిలాల ఫోటోలు పంపిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 ఆర్బిటర్ కెమెరా చంద్రబిలాలను చిత్రీకరించింది. దానితో పాటు చంద్రునిపై అనేక విశేషాలను భూమికి చేరవేస్తోంది. ఆగస్టు 23వ తేదీన రాత్రి 7:42 గంటలకు ఆర్బిటర్ కెమెరా ద్వారా ఈ చిత్రాలను రికార్డు చేసింది. చంద్రునికి 4375 కి.మీ. ఎత్తు నుండి ఈ ఫోటోలను చిత్రీకరించారు.

ఆర్బిటర్ టెర్రియన్ మ్యాపింగ్ కెమెరా-2 ఈ బిలాలను చిత్రీకరించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితో పాటు చంద్రుని ఉత్తరార్థ గోళంలోని జాక్సన్ మాక్, మిత్ర, కొరోలివే వంటి బిలాలా చాయా చిత్రాలు, సౌర మచ్చలను ఇస్రో విడుదల చేసింది.

1:18 PM IST

చంద్రుడి నుంచి తొలి ఫోటో ఇదే...

భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2  చంద్రుడి ఫోటోను తీసింది. చంద్రయాన్-2 తీసిన తొలి ఫోటోను ఇస్రో విడుదల చేసింది. గురువారం నాడు ఇస్రో ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.

ఆగస్టు 21వ తేదీన ఈ ఫోటోను తీసినట్టుగా ఇస్రో ప్రకటించింది.చంద్రుడి ఉపరితలానికి 2600 కి.మీ. ఎత్తులో తీసిన ఫోటో అని ఇస్రో ప్రకటించింది. ఈ చిత్రంలో చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్ ఓరియంటేల్ అనే మరొక బిలాన్ని ఇస్రో గుర్తించింది.

1:10 PM IST

చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

ఆగస్టు 20న చంద్రయాన్-2 చంద్రుని కక్ష్యలో ప్రవేశించింది. మంగళవారం ఉదయం 9.30కి చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి చేరింది. ఈ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అత్యంత కీలక ఘట్టం..

ఈ ప్రక్రియలో ఉపగ్రహంలోని ద్రవ ఇంజిన్‌ను మండిస్తారు....  చంద్రయాన్-2 వేగాన్ని తగ్గించి... దశ, దిశ మార్చడంతో చంద్రుని కక్ష్యలోకి చేరుకోనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టనున్నారు శాస్త్రవేత్తలు.

1:09 PM IST

భూకక్ష్యను దాటిన చంద్రయాన్-2.. చంద్రునివైపు వడివడిగా

ఆగస్టు 14న  చంద్రయాన్-2 వ్యోమనౌక భూ కక్ష్యను దాటి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. బుధవారం తెల్లవారుజామున 2.21 గంటల ప్రాంతంలో ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యను పెంచే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. నౌకలోని ద్రవ ఇంజిన్‌ను 1,203 సెకన్లపాటు మండించి కక్ష్యను పెంచినట్లు ఇస్రో తెలిపింది.

ప్రస్తుతం ఇది జాబిల్లి కక్ష్యకు చేరే ట్రాన్స్ ల్యూనార్ మార్గం గుండా ప్రయాణిస్తోందని.. మరో ఆరు రోజుల తర్వాత ఆగస్టు 20న వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇప్పటి వరకు చంద్రయాన్-2 ఎలాంటి అవరోధం లేకుండా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. శివన్ తెలిపారు. వ్యోమనౌక సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలం దక్షిణ ధ్రువం సమీపంలో దిగనుందన్నారు.

బెంగళూరులోని ఇస్రో మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స నుంచి నిరంతరంగా చంద్రయాన్-2 గమనాన్ని పర్యవేక్షిస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

1:01 PM IST

చంద్రయాన్-2: భూమి ఫోటోల విడుదల

చంద్రయాన్-2 విక్రమ్ లాండర్  తీసిన భూమికి చెందిన ఫోటోలను ఇస్రో ఆగస్టు 4 ఆదివారం నాడు ఉదయం విడుదల చేసింది. చంద్రయాన్-2 విక్రమ్ లాండర్ భూమి ఫోటోలను ఎల్14 కెమెరాలో బంధించింది.

చంద్రయాన్-2 లోని అన్ని విభాగాలు విజయవంతంగా సాగుతున్నాయని ఇస్రో రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆగష్టు 6 వతేదీన ఆర్బిట్ కక్ష్య పెంచనున్నట్టు ఇస్రో ప్రకటించింది.

ఒకటి, రెండు, మూడు ఆర్బిట్ల కక్ష్య పెంపులు విజయవంతమయ్యాయి.  చంద్రయాన్-2  ఈ నెల 20వ తేదిన చంద్రుడిపై చేరుకోనుంది. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపైకి చేరుకొనేలా ఇస్రో ప్లాన్ చేసింది.

1:00 PM IST

చంద్రయాన్-2లో రెండో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో

 జూలై 26న చంద్రయాన్-2 యాత్రలో రెండో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. భూకక్ష్యను పెంచే క్రమంలో ఇప్పటికే బుధవారం మధ్యాహ్నం మొదటి భూ కక్ష్యను పెంచగా.. శుక్రవారం తెల్లవారుజుమున 1.08 నిమిషాలకు రెండో భూకక్ష్యను సైతం పెంచారు.

దీంతో చంద్రయాన్-2 వాహకనౌక 251×56829 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్యలోకి చేరింది. చంద్రయాన్-2 వాహక నౌకలోని ఆన్‌బోర్డ్ ఇంధనాన్ని 883 సెకన్లపాటు మండించడం ద్వారా విజయవంతంగా కక్ష్యను పెంచినట్లు ఇస్రో వెల్లడించింది.

జూలై 29న మధ్యాహ్నం మూడోసారి భూకక్ష్యను పెంచే ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఆగస్టు 14 వరకు ఇలాగే భూకక్ష్యలు పెంచే ప్రక్రియలు కొనసాగనున్నాయి. 

12:57 PM IST

చంద్రయాన్ 2 విజయవంతం... ప్రధాని, రాష్ట్రపతి అభినందనలు

జూలై 22 సోమవారం చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 20గంటల కౌంట్ డౌన్ అనంతరం 3.8టన్నుల బరువైన చంద్రయాన్ 2 ఉపగ్రహంతో మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికి ఎగిసింది. చంద్రయాన్ 2 విజయవంతం కావడం పట్ల సర్వత్రా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.

కాగా... ఈ ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలు అభినందనలు తెలిపారు. చంద్రయాన్ 2 ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. దీనిని కేవలం మన దేశీయులు మాత్రమే పూర్తి చేశారని మోదీ పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అంకిత భావం, కృషి ఈ విజయానికి కారణమని మోదీ అన్నారు.

చంద్రయాన్ 2 భావితరాలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఈ విజయం తర్వాతి తరాలవారికి సైన్స్ పై ఇష్టం పెరిగేలా చేస్తుందని చెప్పారు. చంద్రయాన్ కి ఈ సందర్భంగా మోదీ దన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చిందని... చంద్రునిపై మనకున్న జ్ఞానం మరింత పెరుగుతుందని మోదీ ఈ సందర్భంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఏపీ ముఖ్యమంత్రి జగన్ లు కూడా చంద్రయాన్ 2 విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనిని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు దన్యవాదాలు తెలిపారు.

1:48 PM IST:

సెప్టెంబర్ 2వ తేదీని చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా వేరుపడింది. మధ్యాహ్నం సరిగ్గా 1.15 గంటలకు ల్యాండర్, ఆర్బిటర్ నుంచి విడిపోయి చంద్రునికి 119*127 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యకు చేరింది. బెంగళూరులోని ఇస్రో  మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

1:43 PM IST:

ఆగస్టు 28న చంద్రయాన్-2 వ్యోమనౌకను మూడో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.  బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి బుధవారం ఉదయం 9:04 గంటల సమయంలో ఆన్‌బోర్డ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సాయంతో అందులోని ధ్రవ ఇంధనాన్ని 1190 సెకన్లపాటు మండించి ఈ ఉపగ్రహాన్ని చంద్రుని రెండో కక్ష్య నుంచి మూడో కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియతో వ్యోమనౌక చంద్రునికి 179 కి.మీ. దగ్గరగా, 1412 కి.మీ. దూరంగా ఉన్న కక్ష్యలోకి చేరి జాబిల్లికి మరింత చేరువవుతుంది. 

1:41 PM IST:

చంద్రయాన్-2 ఆర్బిటర్ కెమెరా చంద్రబిలాలను చిత్రీకరించింది. దానితో పాటు చంద్రునిపై అనేక విశేషాలను భూమికి చేరవేస్తోంది. ఆగస్టు 23వ తేదీన రాత్రి 7:42 గంటలకు ఆర్బిటర్ కెమెరా ద్వారా ఈ చిత్రాలను రికార్డు చేసింది. చంద్రునికి 4375 కి.మీ. ఎత్తు నుండి ఈ ఫోటోలను చిత్రీకరించారు.

ఆర్బిటర్ టెర్రియన్ మ్యాపింగ్ కెమెరా-2 ఈ బిలాలను చిత్రీకరించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితో పాటు చంద్రుని ఉత్తరార్థ గోళంలోని జాక్సన్ మాక్, మిత్ర, కొరోలివే వంటి బిలాలా చాయా చిత్రాలు, సౌర మచ్చలను ఇస్రో విడుదల చేసింది.

1:37 PM IST:

భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2  చంద్రుడి ఫోటోను తీసింది. చంద్రయాన్-2 తీసిన తొలి ఫోటోను ఇస్రో విడుదల చేసింది. గురువారం నాడు ఇస్రో ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.

ఆగస్టు 21వ తేదీన ఈ ఫోటోను తీసినట్టుగా ఇస్రో ప్రకటించింది.చంద్రుడి ఉపరితలానికి 2600 కి.మీ. ఎత్తులో తీసిన ఫోటో అని ఇస్రో ప్రకటించింది. ఈ చిత్రంలో చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్ ఓరియంటేల్ అనే మరొక బిలాన్ని ఇస్రో గుర్తించింది.

1:11 PM IST:

ఆగస్టు 20న చంద్రయాన్-2 చంద్రుని కక్ష్యలో ప్రవేశించింది. మంగళవారం ఉదయం 9.30కి చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి చేరింది. ఈ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అత్యంత కీలక ఘట్టం..

ఈ ప్రక్రియలో ఉపగ్రహంలోని ద్రవ ఇంజిన్‌ను మండిస్తారు....  చంద్రయాన్-2 వేగాన్ని తగ్గించి... దశ, దిశ మార్చడంతో చంద్రుని కక్ష్యలోకి చేరుకోనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టనున్నారు శాస్త్రవేత్తలు.

1:09 PM IST:

ఆగస్టు 14న  చంద్రయాన్-2 వ్యోమనౌక భూ కక్ష్యను దాటి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. బుధవారం తెల్లవారుజామున 2.21 గంటల ప్రాంతంలో ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యను పెంచే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. నౌకలోని ద్రవ ఇంజిన్‌ను 1,203 సెకన్లపాటు మండించి కక్ష్యను పెంచినట్లు ఇస్రో తెలిపింది.

ప్రస్తుతం ఇది జాబిల్లి కక్ష్యకు చేరే ట్రాన్స్ ల్యూనార్ మార్గం గుండా ప్రయాణిస్తోందని.. మరో ఆరు రోజుల తర్వాత ఆగస్టు 20న వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇప్పటి వరకు చంద్రయాన్-2 ఎలాంటి అవరోధం లేకుండా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. శివన్ తెలిపారు. వ్యోమనౌక సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలం దక్షిణ ధ్రువం సమీపంలో దిగనుందన్నారు.

బెంగళూరులోని ఇస్రో మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స నుంచి నిరంతరంగా చంద్రయాన్-2 గమనాన్ని పర్యవేక్షిస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

1:02 PM IST:

చంద్రయాన్-2 విక్రమ్ లాండర్  తీసిన భూమికి చెందిన ఫోటోలను ఇస్రో ఆగస్టు 4 ఆదివారం నాడు ఉదయం విడుదల చేసింది. చంద్రయాన్-2 విక్రమ్ లాండర్ భూమి ఫోటోలను ఎల్14 కెమెరాలో బంధించింది.

చంద్రయాన్-2 లోని అన్ని విభాగాలు విజయవంతంగా సాగుతున్నాయని ఇస్రో రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆగష్టు 6 వతేదీన ఆర్బిట్ కక్ష్య పెంచనున్నట్టు ఇస్రో ప్రకటించింది.

ఒకటి, రెండు, మూడు ఆర్బిట్ల కక్ష్య పెంపులు విజయవంతమయ్యాయి.  చంద్రయాన్-2  ఈ నెల 20వ తేదిన చంద్రుడిపై చేరుకోనుంది. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపైకి చేరుకొనేలా ఇస్రో ప్లాన్ చేసింది.

1:01 PM IST:

 జూలై 26న చంద్రయాన్-2 యాత్రలో రెండో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. భూకక్ష్యను పెంచే క్రమంలో ఇప్పటికే బుధవారం మధ్యాహ్నం మొదటి భూ కక్ష్యను పెంచగా.. శుక్రవారం తెల్లవారుజుమున 1.08 నిమిషాలకు రెండో భూకక్ష్యను సైతం పెంచారు.

దీంతో చంద్రయాన్-2 వాహకనౌక 251×56829 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్యలోకి చేరింది. చంద్రయాన్-2 వాహక నౌకలోని ఆన్‌బోర్డ్ ఇంధనాన్ని 883 సెకన్లపాటు మండించడం ద్వారా విజయవంతంగా కక్ష్యను పెంచినట్లు ఇస్రో వెల్లడించింది.

జూలై 29న మధ్యాహ్నం మూడోసారి భూకక్ష్యను పెంచే ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఆగస్టు 14 వరకు ఇలాగే భూకక్ష్యలు పెంచే ప్రక్రియలు కొనసాగనున్నాయి. 

12:59 PM IST:

జూలై 22 సోమవారం చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 20గంటల కౌంట్ డౌన్ అనంతరం 3.8టన్నుల బరువైన చంద్రయాన్ 2 ఉపగ్రహంతో మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికి ఎగిసింది. చంద్రయాన్ 2 విజయవంతం కావడం పట్ల సర్వత్రా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.

కాగా... ఈ ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలు అభినందనలు తెలిపారు. చంద్రయాన్ 2 ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. దీనిని కేవలం మన దేశీయులు మాత్రమే పూర్తి చేశారని మోదీ పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అంకిత భావం, కృషి ఈ విజయానికి కారణమని మోదీ అన్నారు.

చంద్రయాన్ 2 భావితరాలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఈ విజయం తర్వాతి తరాలవారికి సైన్స్ పై ఇష్టం పెరిగేలా చేస్తుందని చెప్పారు. చంద్రయాన్ కి ఈ సందర్భంగా మోదీ దన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చిందని... చంద్రునిపై మనకున్న జ్ఞానం మరింత పెరుగుతుందని మోదీ ఈ సందర్భంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఏపీ ముఖ్యమంత్రి జగన్ లు కూడా చంద్రయాన్ 2 విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనిని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు దన్యవాదాలు తెలిపారు.

48 రోజుల అద్భుత ప్రయాణం తర్వాత చంద్రయాన్ 2 తన లక్ష్యానికి చేరువైంది. 48 రోజుల యాత్రలో వ్యోమనౌక క్షేమంగా చంద్రుని దక్షిణ ధ్రువం చేరడం వెనుక శాస్త్రవేత్తల కృషి దాగుంది. జూలై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్ ఎంకే-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.