Asianet News TeluguAsianet News Telugu

ఇస్రోకి పదేళ్ల బాలుడి లేఖ... సోషల్ మీడియాలో వైరల్

ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెబుతూ ఆ బాలుడు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ బాలుడు లేఖలో రాసిన ప్రతి విషయంలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంత చిన్నపిల్లాడు ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పడం గమనార్హం.

Chandrayaan-2: Don't get disheartened so soon, 10-year-old pens inspiring letter to Isro
Author
Hyderabad, First Published Sep 9, 2019, 10:37 AM IST

చంద్రయాన్ -2 చివరి అంకానికి చేరుకొని.. మరో రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా...  సిగ్నల్స్ అందకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వారికి ధైర్యం చెప్పేందుకు ప్రధాని మోదీ కూడా ప్రయత్నించారు. 

శాస్త్రవేత్తలు ధైర్యం  కోల్పోకూడదంటూ... పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. కాగా... ఓ పదేళ్ల బాలుడు కూడా ఈ ఘటనపై స్పందించాడు. ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెబుతూ ఆ బాలుడు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ బాలుడు లేఖలో రాసిన ప్రతి విషయంలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంత చిన్నపిల్లాడు ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పడం గమనార్హం.

‘‘అంత త్వరగా స్థైర్యాన్ని కోల్పోవద్దు. మనం తప్పకుండా చంద్రుణ్ని చేరుతాం. వచ్చే జూన్‌లో లాంచ్‌ చేయనున్న ‘చంద్రయాన్‌-3’ మన లక్ష్యం. ఆర్బిటర్‌ ఇంకా అక్కడే (చంద్రుడి కక్ష్యలో) ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అది మనకు ఛాయాచిత్రాలను పంపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ విత్తనాలను నాటి మొక్కలు పెంచాలో అదే మనకు చెబుతుంది. విక్రమ్‌ ల్యాండయ్యే ఉంటుంది. ప్రజ్ఞాన్‌ పనిచేస్తూ గ్రాఫికల్‌ బ్యాండ్స్‌ను మనకు పంపించేందుకు సిద్ధమవుతూ ఉండి ఉంటుంది. అదే జరిగితే విజయం మనచేతుల్లోనే. తదుపరి తరం పిల్లలకు ఇస్రో శాస్త్రజ్ఞులే స్ఫూర్తిదాయకం. ‘ఇస్రో.. నువ్వు మాకు గర్వకారణం.’ దేశం తరఫున ఇస్రోకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జైహింద్’’ అంటూ పదేళ్ల ఆంజనేయ కౌల్ అనే బాలుడు లేఖలో పేర్కొన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios