ప్రయాగరాజ్ కుంభమేళాలో అజాద్ తుపాకీ ... దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

2025 మహా కుంభమేళాను ఓ ఆద్యాత్మిక కార్యక్రమంగానే కాదు దేశభక్తిని పెంపొందించేలా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వాంతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ పిస్తోలుతో పాటు పురాతన ఆయుధాల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు.  

Chandrashekhar Azads Pistol to be Displayed at Prayagraj Mahakumbh 2025 AKP

ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 సనాతన ధర్మంలోనే అతిపెద్ద కార్యక్రమంగా నిలవనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సలహాలు, సూచనలతో ఈసారి కుంభమేళాను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన మహానుభావుల గాథను ఈ మహాకుంభంలో ప్రదర్శించనుంది. ఈ ప్రదర్శనలో చంద్రశేఖర్ ఆజాద్ పిస్తోలును కూడా వుంచనున్నారు. ఇవే కాకుండా మ్యూజియంలోని అనేక పురాతన ఆయుధాల ప్రతిరూపాలు కూడా దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకోనున్నాయి.

క్రాంతివీరుల గాథ

అలహాబాద్ మ్యూజియం డిప్యూటీ క్యూరేటర్ డాక్టర్ రాజేష్ మిశ్రా స్పందిస్తూ... మహా కుంభమేళా ద్వారా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ దేశవిదేశాల నుంచి ప్రయాగరాజ్ కు వచ్చే కోట్లాది మంది భక్తులకు భారత స్వాతంత్య్ర సమరయోధుల గాథను వివరించనుంది. ఈ ఉద్దేశ్యంతోనే స్వాతంత్య్ర పోరాటయోధుల జీవితాలకు సంబంధించిన ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ మహా కుంభమేళా ప్రదర్శన కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని స్థలం కోరింది. దీనికి యోగి సర్కార్ కూడా అంగీకరించింది.  ఇక్కడ ఏర్పాటుచేసే ప్రదర్శన ద్వారా దేశ స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల గురించి ప్రజలు తెలుసుకుంటారు. వారి త్యాగఫలం గురించి తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. అనేకమంది సమరయోధుల జీవిత చరిత్రలు ప్రదర్శనలో ఉంటాయి. అయితే ఇందులో ప్రదర్శించే పురాతన ఆయుధాల ప్రతిరూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పవచ్చు. వీటిలో చంద్రశేఖర్ ఆజాద్ పిస్తోలు ప్రధానమైనది. దీన్ని ఆజాద్ 'బమతుల్ బుఖారా' అని పిలిచేవారు.

బమతుల్ బుఖారా ప్రత్యేకత

చంద్రశేఖర్ ఆజాద్ పిస్తోలు 'బమతుల్ బుఖారా' నుంచి బుల్లెట్ వెలువడిన తర్వాత పొగ రాదు. అందువల్ల బ్రిటిష్ వారికి ఎక్కడి నుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలిసేది కాదు. ఇది కోల్ట్ కంపెనీ 32 బోర్ హామర్‌లెస్ సెమీ ఆటోమేటిక్ పిస్తోలు. దీని మ్యాగజైన్‌లో ఒకేసారి ఎనిమిది బుల్లెట్లు ఉంటాయి. ఆజాద్ పిస్తోలును చూసేందుకు చరిత్ర ప్రియులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు.

ఈ ఆజాద్ పిస్తోలును ప్రస్తుతం ప్రయాగరాజ్‌లోని జాతీయ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ పిస్తోలు మ్యూజియంలోని ఆజాద్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios