అయోధ్యా కాసు పై నేడు వెలువడనున్నతీర్పు పై ఆంధ్రప్రదేశ్ టి‌డి‌పి  పార్టీ అధినేత చంద్రబాబు తన ట్విట్టర్ అక్కౌంట్ లో దీని పై  స్పందించాడు.

అయోధ్య కేసు విచారణను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న పూర్తి చేసింది. అయోధ్యా కేసు పై నేడు వెలువడనున్నతీర్పు పై ఆంధ్రప్రదేశ్ టి‌డి‌పి పార్టీ అధినేత చంద్ర బాబు తన ట్విట్టర్ అక్కౌంట్ లో దీని పై స్పందిస్తూ "అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంలో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.

తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి." అని ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

అలాగే చంద్రబాబు తనయుడు టి‌డి‌పి పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ నారా లోకేశ్ కూడా అయోధ్యా పై స్పందిస్తూ "ఎంతో అస్పష్టతతో కూడుకున్న విషయం అయోధ్యా తిర్పుపై దేశం మొత్తం ఎదురు చూస్తుంది రాబోయే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మనం గట్టిగా తీసుకోవాలి మరియు మనం ఒక భారతీయులం అని ప్రపంచానికి నిరూపించాలి."

Scroll to load tweet…