కోల్‌కతా: కేంద్రం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  ఆరోపించారు.

మంగళవారం నాడు కోల్‌కతాలో బెంగాల్ సీఎం మమత బెనర్జీతో  చంద్రబాబునాయుడు దీక్ష విరమింపజేశారు.తన రాజకీయ జీవితంలో  ఈ తరహా పరిస్థితులను ఎప్పుడూ చూడలేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము కలిసికట్టుగా పోరాటం చేస్తామన్నారు.

త్వరలోనే తామంతా సమావేశం కానున్నట్టు ఆయన చెప్పారు.  భవిష్యత్తులో ఏ సమస్య జరిగినా తనతో పాటు మమత బెనర్జీ, రాహుల్ గాంధీ లాంటి నేతలతో ఎన్డీఏ పక్షాలు కలిసి రానున్నాయని బాబు చెప్పారు.ఏపీ, బెంగాల్, ఢిల్లీ అభివృద్ధిని  అడ్డుకొంటున్నారని బాబు ఆరోపించారు. బెంగాల్ ప్రజలంతా  మమతకు అండగా నిలిచారని ఆయన చెప్పారు.