తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి, తెలంగాణ ఎన్నికల్లో పొత్తు తదితర అంశాలపై 15 నిమిషాలపాటు వీరిద్దరూ చర్చించుకున్నారు.

అనంతరం మధ్యహ్నాం 3.30 కి చంద్రబాబు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసంలో ఆయనతో సమావేశమవుతారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.