హైదరాబాద్: జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకించేందుకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వదులుకోవడం లేదు. బుధవారం రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

హైదరాబాదులో కూడా ఇరువురు వేదికను పంచుకున్నారు. ఈ స్థితిలో గురువారం ఉదయం చంద్రబాబు రాహుల్ గాంధీని అల్పాహార విందుకు ఆహ్వానించారు. పార్క్ హయత్ హోటల్లో వారిద్దరు కలిసి అల్పాహార విందు ఆరగించారు. 

హైదరాబాదులో పార్టీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బిఎస్పీ అధినేత మాయావతి అదే హోటల్లో బస చేశారు. ఈ విందుకు ఆమె హాజరయ్యారా, లేదా అనేది తెలియడం లేదు. జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా చక్రం తిప్పేందుకు నడుం బిగించిన చంద్రబాబు ఆమెను కూడా బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించినట్లు చెబుతున్నారు