న్యూఢిల్లీ:  లాక్ డౌన్ సడలింపులపై కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. రెస్టారెంట్లను, బుక్ షాపులను ఈ రోజు నుంచి తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది లాక్ డౌన్ నిబంధనల ఉలంఘన కిందికి వస్తుందని కేంద్రం వ్యాఖ్యానించింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.

కేరళ ప్రభుత్వం రెండు జోన్లలో కోవిడ్ -19 లాక్ డౌన్ ఆంక్షలను సడలిచింది. ప్రైవేట్ వాహనాలను సరి, బేసి సంఖ్యలో అనుతించింది. సోమవారం నుంచి హోటల్స్ లో భోజనాలు చేయడాన్ని కూడా అనుతించింది.

స్థానిక వర్క్ షాపులను, కార్లలోని వెనక సీట్లో ఇద్దరు ప్రయాణికులను, టూవీలర్స్ పై ఇద్దరిని అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ ఆంక్షలను కొనసాగించాలని సూచించింది. ఆ నేపథ్యంలో కేరళపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది.

కరోనా వైరస్ కట్టడికి కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన మర్నాడే కేంద్రం ఆంక్షల సడలింపుపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.