Asianet News TeluguAsianet News Telugu

కరోనాను అరికట్టేందుకు రాష్ట్రాలకు అండ: మన్‌కీ బాత్‌లో మోడీ

కరోనా సెకండ్ వేవ్ నుండి బయటపడేందుకు రాష్ట్రాలకు  కేంద్రం అండగా నిలుస్తోందని  ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

Centre standing beside states to help them get through second Covid wave, says Modi lns
Author
New Delhi, First Published Apr 25, 2021, 12:07 PM IST

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నుండి బయటపడేందుకు రాష్ట్రాలకు  కేంద్రం అండగా నిలుస్తోందని  ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.ఆదివారం నాడు  మన్‌కీబాత్ కార్యక్రమంలో  ప్రధాని మోడీ  ప్రసంగించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోందన్నారు. కరోనా తొలి దశను విజయవంతంగా ఎదుర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మరోసారి కోవిడ్‌పై యుద్ధం చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. కరోనాను  గ్రామాల్లోకి చేరకుండా అడ్డుకోవాలని  ఆయన ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తీసుకోవాలని ఆయన సూచించారు.మే, జూన్ నెలల్లో పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నట్టుగా చెప్పారు. 

మన సహనాన్ని కరోనా పరీక్షిస్తున్న సమయంలో మీతో నేను మాట్లాడుతున్నానని మోడీ చెప్పారు. నమ ప్రియమైనవారిలో చాలా మంది మరణించారన్నారు.  దేశంలోని కార్పోరేట్ రంగం కూడా తమ ఉద్యోగులకు టీకా వేయడం ద్వారా టీకా డ్రైవ్ లో పాల్గొనవచ్చన్నారు.  దేశం ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా అందిస్తోందన్నారు.

 కరోనా సెకండ్ వేవ్ ను తట్టుకొనేందుకు ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు శ్రమిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. చాలా మంది వైద్యులు రోగులకు ఆన్ లైన్ లో  సంప్రదింపులు  చేసుకొనేలా టెక్నాలజీని ఉపయోగించుకోవడం ప్రశంసనీయమైందిగా మోడీ పేర్కొన్నారు.మన్ కీ బాత్ కార్యక్రమంలో  ముంబై కి చెందిన డాక్టర్ శశాంక్ తో మోడీ మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదలతో పాటు మరిన్ని రికవరీ కేసులు పెరుగుతున్నందున ప్రజలు భయపడకూడదని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios