Constitution: సెక్యులర్, సోషలిస్ట్ పదాలు లేని ‘ఒరిజినల్’ రాజ్యాంగ పీఠికను షేర్ చేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం మరోసారి సెక్యులర్, సోషలిస్ట్ పదాలు లేని రాజ్యాంగ పీఠికను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో వాదోపవాదనలు మొదలయ్యాయి. ఇది ఒరిజినల్ రాజ్యాంగ పీఠిక అని, సవరణలు చేయడానికి ముందటిదని ఇది వరకే గతంలో బీజేపీ సమర్థించుకున్న సంగతి తెలిసిందే.
Constitution: కేంద్ర ప్రభుత్వం ‘ఒరిజినల్’ రాజ్యాంగ పీఠికను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సెక్యులర్, సోషలిస్ట్ పదాలు లేవు. దీంతో మరోసారి ఈ నిర్ణయంపై వాదనలు చెలరేగాయి.
రాజ్యాంగ పీఠికను 1949 నవంబర్ 26వ తేదీన ఎంచుకున్నారు. అదే రోజు అది అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సంక్షిప్తంగా ఈ పీఠిక వెల్లడిస్తున్నంది. ఈ పీఠికను 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న హయాంలో సవరించారు. అప్పుడు రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు(సామ్యవాద), సెక్యులర్ (లౌకిక) పదాలతోపాటు ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా చేర్చింది.
తాజాగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పీఠికను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ మౌలిక సూత్రాలతో ఇప్పటి నవ భారతం ఎంతమేరకు ఏకీభవిస్తున్నది?అనే ప్రశ్న వేస్తూ ఈ పీఠికను పంచుకుంది.
Also Read: Gyanvapi Mosque: జ్ఞానవాపి స్థలాన్ని ముస్లింలు హిందువులకు అప్పగించాలి: కేంద్రమంత్రి
సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను బీజేపీ సుదీర్ఘకాలంగా వ్యతిరేకిస్తున్నది. ఈ పదాలు రాజ్యాంగ స్ఫూర్తిని గైకొనడం లేదని, వాటిని చేర్చడం సరికాదని అప్పట్లోనే బీజేపీ వాదించింది. రాజ్యాంగం నుంచి సోషలిజం అనే పదాన్ని తొలగించాలని, భావి తరాలను ఒక ప్రత్యేక భావజాలానికి కట్టివేయరాదని బీజేపీ వాదించింది.