న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. పౌరసత్వంపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కేసు దాఖలు చేశారు. రాహుల్ గాంధీ నామినేషన్లను ఆమోదించకుండా ఉండాలని కూడ ఆయన డిమాండ్ చేశారు.

ఇదే డిమాండ్ తో సుబ్రమణ్యస్వామి కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఫిర్యాదు కూడ చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా  కేంద్ర హోంశాఖ  ఆదేశాలు జారీ చేసింది.

రాహుల్‌గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని  కూడ సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఓ కంపెనీ రిజిస్ట్రేషన్ సమయంలో రాహుల్ గాంధీకి బ్రిటిషన్ పౌరసత్వం కలిగి ఉన్నట్టుగా ఆయన ఆరోపించారు.

ఇదే విషయమై ఆమేథీలో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్ధి కూడ రాహుల్ గాంధీ నామినేషన్‌ను ఆమోదించకూడదని కోరారు. కానీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ నామినేషన్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే.