కేంద్ర మంత్రివిస్తరణ తర్వాత కేబినెట్ సబ్ కమిటీల్లో కూడా ప్రధాని మోడీ మార్పులు చేర్పులు చేశారు. మంత్రివర్గం నుండి స్థానం కోల్పోయినవారి స్థానంలో కొత్త మంత్రులతో ఆయా కమిటీలను భర్తీ చేశారు. కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజులకు స్థానం కల్పించారు.


న్యూఢిల్లీ: మంత్రివర్త విస్తరణ పూర్తి కావడంతో కేబినెట్ కమిటీలను ప్రధాని మోడీ పునర్వవ్యస్థీకరించారు. రాజకీయ వ్యవహరాల కేబినెట్ కమిటీలో స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్, వీరేంద్రకుమార్, గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా, శర్వానంద సోనోవాల్, మన్‌సుఖ్ మాండవీయలకు చోటు దక్కింది.

రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహరాల శాఖ ఉప సంఘంలో అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, వీరేంద్రకుమార్ లను నియమించారు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ స్థానంలో అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజులకు స్థానం దక్కింది.నైపుణ్య వ్యవహరాల ఉప సంఘంలో ఆర్పీపీ సంగ్, ఆశ్వనీ చౌబే భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డిలను నియమించారు. 

దేశ భద్రతకు సంబంధించి భద్రతా వ్యవహరాల కేబినెట్ సబ్ కమిటీలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కమిటీలో మోడీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, .జైశంకర్ లకు చోటు కల్పించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం మోడీ మంత్రి వర్గాన్ని విస్తరించారు.