Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ సర్వీసులపై కేంద్రం ఆర్డినెన్స్‌: సీఎం కేజ్రీవాల్ స‌ర్కారుకు సీపీఐ(ఎం) మద్దతు

New Delhi: కేంద్రం ఆర్డినెన్స్‌ను తీవ్రంగా ప్రతిఘటించేందుకు ఢిల్లీ ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప‌లు పార్టీల రాజ‌కీయ నాయ‌కుల‌తో భేటీ అవుతూ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం త‌ర్వాత సీపీఎం నేత సీతారాం ఏచూరితోనూ భేటీ అయ్యారు.
 

Centre ordinance on Delhi services: CPI(M) extends support to Cm Kejriwal's government  RMA
Author
First Published May 30, 2023, 4:43 PM IST

CPI(M) to back CM Kejriwal-led AAP govt: కేంద్రం ఆర్డినెన్స్‌ను తీవ్రంగా ప్రతిఘటించేందుకు ఢిల్లీ ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప‌లు పార్టీల రాజ‌కీయ నాయ‌కుల‌తో భేటీ అవుతూ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం త‌ర్వాత సీపీఎం నేత సీతారాం ఏచూరితోనూ భేటీ అయ్యారు.

వివ‌రాల్లోకెళ్తే.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో పరిపాలనా సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఖండించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, దాని స్థానంలో బిల్లు తీసుకురానున్నప్పుడు పార్లమెంటులో ఆప్ కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఢిల్లీలో పరిపాలనా సేవలపై ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ ఉల్లంఘనేననీ, బీజేపీయేతర పార్టీల ప్రభుత్వం విషయంలోనూ ఇలా జరగొచ్చనీ,  ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతివ్వాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

 

 

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీపీఎం (ఎం) కార్యాలయంలో ఏచూరిని కలిసి ఈ అంశంపై వామపక్షాల మద్దతు కోరిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను తాము ఖండిస్తున్నామన్నారు. "ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది కోర్టు ధిక్కరణ కూడా. మన రాజ్యాంగాన్ని కాపాడేందుకు అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని సమావేశం అనంతరం కేజ్రీవాల్ తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఏచూరి పేర్కొన్నారు. రాజ్యసభ అయినా, ఎక్కడైనా ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తామని చెప్పారు.

ఢిల్లీలో గ్రూప్-ఎ అధికారుల బదిలీలు, పోస్టింగ్ కోసం అథారిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం మే 19 న ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇది సేవల నియంత్రణపై సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని ఆప్ ప్రభుత్వం పేర్కొంది. పోలీసు, పబ్లిక్ ఆర్డర్, భూమి మినహా ఢిల్లీలో సేవల నియంత్రణను ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగించిన వారం తర్వాత ఈ ఆర్డినెన్స్ వచ్చింది. డానిక్స్ కేడర్ కు చెందిన గ్రూప్-ఎ అధికారుల బదిలీ, క్రమశిక్షణ చర్యల కోసం నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరింది. ఆర్డినెన్స్ జారీ చేసిన ఆరు నెలల్లోగా దాని స్థానంలో కేంద్రం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios