Asianet News TeluguAsianet News Telugu

Covid-19 postage stamp: కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్

 Covid-19 postage stamp:  భార‌త్‌లో కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి జనవరి 16తో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్టాంప్‌ను ఆవిష్కరించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టల్ స్టాంపు ముద్రించి ఆదివారం నాడు విడుదల చేసింది. 
 

Centre issues postal stamp to mark 1 year of Covid vaccination drive
Author
Hyderabad, First Published Jan 17, 2022, 6:12 AM IST

Covid-19 postage stamp:  క‌రోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించి జనవరి 16తో ఏడాది పూర్తి అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కూ దేశవ్యాప్తంగా 157.70 కోట్ల డోస్‌లను అందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్టాంప్‌ను ఆవిష్కరించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టల్ స్టాంపు ముద్రించి ఆదివారం నాడు విడుదల చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయినందున ఈ రోజు ప్ర‌త్యేక‌మ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంద‌ని అభిప్రాయ ప‌డ్డారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. వయోజన జనాభాలో దాదాపు 93% మంది మొదటి డోస్‌,  70% వ‌యోజ‌నల‌కురెండవ డోస్ టీకాలు వేయించుకున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ జనవరి 16, 2021న ప్రారంభించబడింది. కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ అనే మూడు వ్యాక్సిన్ల‌ను ఈ డ్రైవ్ లో ఉప‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలో గత ఏడాది అక్టోబర్ 21న 100 కోట్ల మార్కును దాటింది, అలాగే..  జనవరి 7న 150 కోట్ల మార్కు దాటింది. సెప్టెంబర్ 17, 2021న అత్యధికంగా 2.5 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.  

గత 365 రోజుల్లో, మొదటి డోస్‌లలో 91.07 కోట్ల టీకాల‌ను..రెండవ డోసులు 65.63 కోట్ల టీకాలు ఇవ్వబడ్డాయి. అలాగే.. ఆదివారం సాయంత్రం వరకు, 43.10 లక్షల మందికి బూస్ట‌ర్ డోసుల‌ను ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో 15-18 మ‌ధ్య‌ వయస్సు గల 3.44 కోట్ల మంది పిల్లలు వారి టీకాను పొందారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ అందించిన కోవిడ్-19 వ్యాక్సిన్‌లలో దాదాపు 135.61 కోట్ల సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చెందిన‌ కోవిషీల్డ్ డోస్‌లు కాగా, 21 కోట్ల టీకాలు భారత్ బయోటెక్ చెందిన కోవాక్సిన్ డోస్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు, 11 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి ద‌శ వ్యాక్సినేష‌న్ 100% పూర్తి అయ్యింది. మూడు రాష్ట్రాలు/UTలు పూర్తి టీకాను సాధించాయి. కో-విన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం రిజిస్ట్రేషన్‌లు 100 కోట్ల మార్కుకు చేరువయ్యాయి.

క‌రోనా మ‌హ‌మ్మారిపై  పోరాటానికి భారత టీకా కార్యక్రమం గొప్ప బలాన్ని చేకూర్చిందని, ఇది ప్రాణాలను కాపాడేందుకు, జీవనోపాధిని రక్షించడానికి ఉప‌యోగప‌డుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒక సంవత్సరం డ్రైవ్ పూర్తయిన సందర్భంగా వ్యాక్సినేషన్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఆయన అభివాదం చేస్తూ, మన వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల పాత్ర అసాధారణమైనదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ చేప‌ట్టిన ఘ‌న‌త భార‌త్ కు మాత్రమే ద‌క్కింద‌ని  1.3 బిలియన్ల మంది వ్యాక్సినేష‌న్ చేసుకోవ‌డం సంతోష‌క‌ర‌మని ప్ర‌ధాని మోడీ  అన్నారు. కోవిడ్-19 మహమ్మారి మొదటిసారిగా వచ్చినప్పుడు, వైరస్ గురించి పెద్దగా తెలియదు. అయినప్పటికీ, మ‌న‌ శాస్త్రవేత్తలు  వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడంలో మునిగిపోయారని తెలిపారు.
 
భారత జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. స్టాంప్‌లో కోవాక్సిన్  చిత్రంతో పాటు కోవిడ్-19 వ్యాక్సిన్‌తో సీనియర్ సిటిజన్‌కు టీకాలు వేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్త ఉంది. దేశంలో విమర్శలు, సందేహాలు, అవిశ్వాసం, తప్పుడు సమాచారం వాతావరణంలో ఇదో  మైలురాయిగా మిగులుతుంద‌ని,  ఇప్పటి వరకు మ‌న‌ దేశంలోని  ఎనిమిది వ్యాక్సిన్‌లను ఆమోదించినట్లు మంత్రి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios