Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: ఏసీలు, కూలర్ల వాడకం పై కేంద్రం మార్గదర్శకాలు ఇవే....

 ఏసీలు, కూలర్ల వాడకం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రచారం సాగుతుండడంతో, కేంద్రం వీటి వాడకం పై ఏకంగా 18 పేజీల మార్గదర్శకాలను జారీ చేసింది. ఏసీలను ఏ టెంపరేచర్ లో వాడాలి నుండి మొదలు ఫ్యాన్లు, కూలర్లకు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో ఇందులో  పొందుపరిచారు. 

Centre issues guidelines on use of AC, coolers, fans amid coronavirus outbreak
Author
Hyderabad, First Published Apr 26, 2020, 11:20 AM IST

ఎండాకాలం ప్రాఆరంభమవడంతో ప్రజలంతా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. బయట ఎండ దంచికొడుతుండడంతో అవి అనివార్యమయ్యాయి. ఈకొరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఏసీలు, కూలర్ల  వాడకంపై సందిగ్ధత నెలకొంది.

వీటి వాడకం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రచారం సాగుతుండడంతో, కేంద్రం వీటి వాడకం పై ఏకంగా 18 పేజీల మార్గదర్శకాలను జారీ చేసింది. ఏసీలను ఏ టెంపరేచర్ లో వాడాలి నుండి మొదలు ఫ్యాన్లు, కూలర్లకు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో ఇందులో  పొందుపరిచారు. 

ఏసీల విషయానికి వచ్చేసరికి వాటిని 24 నుంచి 30 డిగ్రీల మధ్య మాత్రమే వాడాలని, రూములో తేమ శాతం 40 నుంచి 70 శాతం ఉండేట్టు చూసుకోవాలని తెలిపారు. ఏసీలు వాడుతున్నప్పటికీ ఒక కిటికీని కానీ లేదా ఏదైనా కొంత గ్యాప్ లోనుంచి బయట గాలి లోపలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని వారు సూచించారు. 

ఏసీలు అధికంగా వాడితే డస్ట్, ఇతరాత్రాల వల్ల ఇన్ఫెక్షన్లు, శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున... అటువంటి ఎలర్జీల బారిన పడకుండా ఉండేందుకు ఏసీలను తరచుగా సర్వీసింగ్ చేపిస్తే మంచిదని వారు తెలిపారు. 

ఇక కూలర్ల విషయానికి వస్తే.... సాధారణ కూలర్లలో ఎయిర్ ఫిల్టర్లు ఉండవు. వాటి వల్ల ఏవైనా ఎలర్జీలు వచ్చి, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు కలిగే ఆస్కారమున్న నేపథ్యంలో కూలర్లకు ఎయిర్ ఫిల్టర్లను ఏర్పాటు చేసుకోమని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఇక ఫ్యాన్ల విషయానికి వస్తే ఫ్యాన్లు వాడుతున్నప్పటికీ కిటికీలను తెరిచి ఉంచమని వారు తెలిపారు. రూంలో బయట నుంచి గాలి వచ్చేలా, లోపలి గాలి బయటకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం తాను జారీ చేసిన 18 పేజీల మార్గదర్శకాల్లో పేర్కొంది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ మూడు వారల లాక్ డౌన్ ముగుస్తుండగానే.... మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు స్వయానా ప్రధానమంత్రే ప్రకటించారు. 

ఇక ఇప్పుడు రెండవ పర్యాయం విధించిన లాక్ డౌన్ కూడా మరో 9 రోజుల్లో ముగియనున్న విషయం అందరికి తెలిసిందే. మే 3వతేదితో ప్రధాని విధించిన లాక్ డౌన్ పూర్తవుతుంది. మే 7వ తేదీతో తెలంగాణాలో కూడా లాక్ డౌన్ ముగుస్తుంది. 

ఇక ఇప్పుడు రెండవ దఫా లాక్ డౌన్ కూడా ముగింపు దశకు రావడం, ఏప్రిల్ 27వ తేదీనాడు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో సర్వత్రా కూడా ఈ లాక్ డౌన్ పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

ఇలా లాక్ డౌన్ ను ఉంచుతారా ఎత్తేస్తారా అని చర్చ నడుస్తుండగానే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తుందనే సంకేతాలను ఇస్తూ దుకాణాలను తెరవడానికి పర్మిషన్ ను ఇచ్చింది. 

గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల షాపులను తెరవడానికి అనుమతిచ్చింది. పట్టణాల్లో మాత్రం కేవలం సింగల్ గా ఉండే షాపులకు మాత్రమే అనుమతులనిచ్చింది. షాపింగ్ మాల్స్ లో ఉండే షాపులకు మాత్రం  అనుమతులను నిరాకరించింది. 

అన్ని దుకాణాలకు అనుమతులను ఇచ్చినప్పటికీ మద్యం దుకాణాలకు మాత్రం అనుమతిని నిరాకరించింది. ఇలా దుకాణాలకు అనుమతులు ఇవ్వడంతో ఖచ్చితంగా లాక్ డౌన్ ను ఎత్తివేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమయినట్టయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios