ఖలిస్తాన్ అనుకూల భావాలను ప్రచారం చేస్తున్న కనీసం ఆరు యూట్యూబ్ ఛానెల్‌లు ప్రభుత్వం బ్లాక్ చేసింది. గత 10 రోజులుగా విదేశాల నుంచి పనిచేస్తున్న ఆరు నుంచి ఎనిమిది యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు.
దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజా శాంతికి సంబంధించిన తప్పుడు సమాచారం చేస్తున్న ఆరు యూట్యూబ్ ఛానెల్‌లపై మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఖలిస్తాన్ అనుకూల భావాలను ప్రచారం చేస్తున్న కనీసం ఆరు యూట్యూబ్ ఛానెల్‌లు ప్రభుత్వం బ్లాక్ చేసింది. గత 10 రోజులుగా విదేశాల నుంచి పనిచేస్తున్న ఆరు నుంచి ఎనిమిది యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు.
పంజాబీ భాషలో కంటెంట్ ఉన్న ఛానెల్‌లు సరిహద్దు రాష్ట్రంలో భద్రతా సమస్యలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అందుకే వాటిని బ్లాక్ చేశామనీ అపూర్వ చంద్ర తెలిపారు. తీవ్రవాద బోధకుడు , ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ , అతని మద్దతుదారులు తమ సహాయకులలో ఒకరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కత్తులు, తుపాకీలతో అజ్నాలాలోని పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
దేశ వ్యతిరేక కంటెంట్ బ్లాక్
ఇది కాకుండా.. యాంటి-ఇండియా కంటెంట్‌ను తొలగించాలని , అలాంటి కంటెంట్‌ను ప్రసారం చేసే ఛానెల్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యూట్యూబ్‌ని ఆదేశించింది. మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ.. "48 గంటల్లోగా ఛానెల్‌లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై యూట్యూబ్ చర్య తీసుకుంటోంది. అయితే, అది భాష సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది." అర్థం చేసుకోవడంలో సమస్య ఉందని తెలిపారు.
యూట్యూబ్‌లో ఉన్న పెద్ద సమస్య ఏమిటి ?
అభ్యంతరకరమైన కంటెంట్‌ను గుర్తించడానికి, నిరోధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , అల్గారిథమ్‌లను ఉపయోగించాలని ప్రభుత్వం యూట్యూబ్‌ని కోరింది. అయితే.. యూట్యూబ్ భాష సమస్యలను ఎదుర్కొంటోంది. కంటెంట్ ప్రాంతీయ భాషలలో అప్‌లోడ్ చేయబడుతోంది. దీనిని గుర్తించడం కష్టంగా మారుతోంది.
అజ్నాలా ఘటన తర్వాత ..
ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్, అతని అనుచరులు అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఆ సంఘటనలో.. అమృతపాల్ సింగ్, అతని మద్దతుదారులు తమ సహచరులలో ఒకరిని విడుదల చేయమని కత్తులు, తుపాకీలతో అజ్నాలా పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. దీంతో పోలీసులు బలవంతంగా విడుదల చేయాల్సి వచ్చింది. 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ కూడా ఖలిస్తానీ మద్దతుదారుగా పరిగణించబడుతున్నారు.
'వారిస్ పంజాబ్ దే' అనే సంస్థను స్థాపించిన పంజాబీ నటుడు, ఉద్యమకారుడు దీప్ సిద్ధూ. అతడు మరణించిన తరువాత.. అమృతపాల్ సింగ్.. ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే స్వగ్రామమైన మోగాలో రోడ్‌షో నిర్వహించాడు. దీంతో ఆయన ఒక్కసారిగా తెరమీదికి వచ్చారు. ఈ క్రమంలో 'వారిస్ పంజాబ్ దే' అధినేతగా నియమించబడ్డారు. ఆయన అంతకుముందు దుబాయ్‌లో పని చేసేవాడు.
