మన దేశంలో రెండో మంకీ పాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి మన దేశంలోకి అడుగుపెడుతున్నవారిపై గట్టి నిఘా పెట్టాలని ప్రయత్నిస్తున్నది. రాష్ట్రాలు, విమానాశ్రయాలు, పోర్టులకు అంతర్జాతీయ ప్రయాణికులపై స్క్రీనింగ్ చేపట్టాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ: మంకీపాక్స్ రెండో కేసు కేరళలో నమోదు అయింది. రెండో కేసు నమోదు కాగానే.. కేంద్ర ప్రభుత్వం వెంటనే కట్టడి చర్యలపై ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు అందరి పైనా కఠినంగా స్క్రీనింగ్ చేయాలని స్పష్టం చేసింది. వారు మన దేశంలో అడుగుపెట్టగానే స్ట్రిక్ట్ హెల్త్ స్క్రీనింగ్ ఉండాలని పేర్కొంది.

ఇప్పటి వరకు ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపైనా స్క్రీనింగ్ చేశారు. అనుమానం ఉన్న శాంపిల్స్‌ను పూణెలోని ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ, మంకీపాక్స్ రెండో కేసు కూడా నమోదు కావడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఎయిర్‌పోర్టులు, పోర్టుల నుంచి మన దేశంలో అడుగు పెడుతున్న అంతర్జాతీయ ప్రయాణికులపై స్క్రీనింగ్ ప్రక్రియపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరోసారి సమీక్ష జరిపింది. మంకీపాక్స్ వ్యాధి ఇతర దేశాల నుంచి మన దేశంలోకి చొరబడకుండా.. చొరబడి విస్తరించకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు, విమానాశ్రయాలు, పోర్టు సిబ్బంది కచ్చితత్వంతో చర్యలు తీసుకోవాలని వివరించింది. ఈ సమాశానికి ఎయిర్‌పోర్టు, పోర్టు హెల్త్ ఆఫీసర్లు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రీజినల్ డైరెక్టర్లు హాజరయ్యారు.

Kerala రాష్ట్రంలో రెండో monkey pox కేసు నమోదైంది. ఈ విషయాన్ని Kerala వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. Dubaiనుండి వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ సోకిందని వైద్యులు గుర్తించారు. మంకీపాక్స్ సోనిక వ్యక్తికి 31 ఏళ్ల వయస్సు ఉంటుంది.ఈ నెల 13న దుబాయ్ నుండి కన్నూర్ కు వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు.కన్నూరులోని ప్రభుత్వ వైద్యకాలేజీలో మంకీపాక్స్ సోకిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్టుగా మంత్రి తెలిపారు

ఈ నెల 12న దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ విషయాన్ని ఆమె ఈ నెల 14న ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుండి నిపుణుల బృందాన్ని పంపింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. 

 మంకీపాక్స్ సోకిన రోగితో కలిసి తిరిగిన వారి సమాచారం సేకరించినట్టుగా అధికారులు తెలిపారు. రోగి తల్లిదండ్రులతో పాటు టాక్సీ డ్రైవర్, ఆటో డ్రైవర్లతో పాటు 11 మంది తోటీ ప్రయాణీకుల సమాచారం సేకరించినట్టుగా అధికారులు ప్రకటించారు.