కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగంలో భారత సివిల్ అకౌంట్స్ సర్వీస్ అధికారి భారతి దాస్‌ను 27వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA)గా కేంద్రం నియమించింది. CGA అకౌంటింగ్ విషయాలపై ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా దాస్​ ఉండనున్నరు.   

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగానికి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సిజిఎ)ని నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. భారతీ దాస్ 1988 బ్యాచ్ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ICAS) అధికారిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల విభాగానికి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) గా నియమితులయ్యారు. ఆమె తక్షణమే తన పదవిని చేపట్టనున్నారు. దీంతో ఆమె 27వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గా పదవి చేపట్టనున్నారు. 

ఇంతకీ భారతీ దాస్ ఎవరు?

భారతీ దాస్ 1988 బ్యాచ్ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ICAS) అధికారి. భారతీ దాస్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాల నుండి హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.అలాగే ఆమె ఆస్ట్రేలియాలోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ పాలసీ, మేనేజ్‌మెంట్‌లో MSc కూడా చేసారు.

భారతీ దాస్ చేపట్టిన ముఖ్యమైన పదవులు
  
ఆమె ఈ నియామకానికి ముందు.. కేంద్ర ప్రభుత్వం కోసం ఖర్చులు, ఆదాయాలు, రుణాలు.. వివిధ ఆర్థిక సూచికల యొక్క నెలవారీ, వార్షిక విశ్లేషణను నిర్వహిస్తారు. అంతేకాకుండా..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్  ప్రిన్సిపల్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ కూడా సేవలందించారు. ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్(CCA), పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గా.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా, ఓడరేవులు,షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీగా కూడా సేవలందించారు.  

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) అకౌంటింగ్ విషయాల కోసం కేంద్ర ప్రభుత్వానికి 'ముఖ్య సలహాదారు'. CGA అనేది సాంకేతికంగా మంచి నిర్వహణ అకౌంటింగ్ వ్యవస్థను స్థాపించడం, నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వ ఖాతాల తయారీ, ప్రదర్శన కోసం బాధ్యత వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ట్రెజరీ నియంత్రణ, అంతర్గత ఆడిట్‌కు కూడా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ బాధ్యత వహిస్తారు.