దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అత్యధికంగా కేసులు నమోదవుతున్న 10 రాష్ట్రాలకు మల్టీ డిసిప్లినరీ బృందాల‌ను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ కట్టడి కోసం ఈ బృందాల‌ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయనున్నాయి. 

ఒమిక్రాన్ ముప్పు పెరుగుతోంది. దేశంలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యింది. దేశంలో ఒమిక్రాన్ ముప్పు అధికంగా ఉన్న ప‌ది రాష్ట్రాల‌కు మ‌ల్టీ డిసిప్లినరీ బృందాల‌ను పంపించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరగ‌డంతో పాటు వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ నెమ్మ‌దిగా సాగుతోంద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ బృందాలు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్‌ల‌కు వెళ్ల‌నున్నాయి. ఆ రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు ఐదు రోజుల పాటు ప‌ర్య‌టిస్తాయి. ఆ సమ‌యంలో కోవిడ్ టెస్ట్‌ల‌ను వేగ‌వంతం చేయ‌డానికి, క‌రోనా నిబంధ‌న‌లు ప‌క‌డ్బంధీగా అమ‌లు చేయ‌డానికి ఆయా రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పని చేస్తారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షిస్తారు. అలాగే హాస్పిట‌ల్స్‌లో ఉన్న మౌళిక సదుపాయాలు, స‌మ‌స్య‌లు వంటివి ప‌రిశీలిస్తారు. అలాగే క‌రోనా ఆయా రాష్ట్రాల్లో ఉన్న క‌రోనా ప‌రిస్థితుల‌ను అంచనా వేస్తాయి. నివార‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌న సూచిస్తాయి. ఆ రాష్ట్రంలో జ‌రుగుతున్న కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై ప్ర‌తీ రోజు సాయంత్రం 7 గంటలకు కేంద్రానికి నివేదిక పంపిస్తాయి. 

దేశంలో ఫిబ్రవరిలో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభణ.. ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనం..

గత అనుభ‌వాల దృష్ట్యా..
క‌రోనా రెండు వేవ్‌లు దేశాన్ని అత‌లాకుత‌లం చేశాయి. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీశాయి. చాలా మంది కుటుంబాలు రోడ్డును ప‌డ్డాయి. ఎన్నో కుటుంబాలు ఆత్మీయుల‌ను కోల్పొయాయి. నిరుద్యోగ రేటు పెరిగింది. ఎంద‌రో మంది ఆక‌లితో అల‌మ‌టించారు. అలాంటి ప‌రిస్థితులు మ‌ళ్లీ ఎదురుకాకూడ‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తుంది. గ‌త రెండు వేవ్‌ల నుంచి నేర్చుకున్న అనుభ‌వాల దృష్ట్యా.. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్ర‌తీ రాష్ట్రంలో హాస్పిట‌ల్స్ సంఖ్య‌ను పెంచుతోంది. అలాగే ఇప్ప‌టికీ అందుబాటులో ఉన్న హాస్పిట‌ల్స్ లో బెడ్స్ సామ‌ర్థ్యం పెంచేందుకు కృషి చేస్తోంది. ఒమిక్రాన్ విజృంభిస్తే కావాల్సిన మందులు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌, ఆక్సీమీట‌ర్స్ వంటివి సిద్ధం చేసింది. 

జమ్మూ కశ్మీర్ లో కొసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత.. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

ప్ర‌పంచ దేశాల్లో ఒమిక్రాన్ వెలుగులోకి వ‌చ్చిన‌ప్పుడే కేంద్ర ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యింది. స్వ‌యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రంగంలోకి దిగి అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో ముఖ్య అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. మ‌న దేశంలోకి కూడా ఒమిక్రాన్ ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలెర్ట్ గా ఉండాల‌ని, అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లూ తీసుకోవాల‌ని సూచించారు. మూడు రోజుల క్రితం కూడా ఆయా రాష్ట్రాలతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి మాట్లాడారు. ఒమిక్రాన్ విస్త‌రిస్తున్నందున్న తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను సూచించారు. అయితే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వెన‌క‌బ‌డిన రాష్ట్రాల‌ను ముందుకు న‌డిపించ‌డానికి కేంద్ర న‌డుంబిగించింది. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల‌కు మ‌ల్టీ డిసిప్లినరీ బృందాల‌ను పంపించ‌నున్నారు. ఇవి ఆయా రాష్ట్రాల ముఖ్య అధికారుల‌తో క‌లిసి ప‌ని చేయ‌నున్నాయి. శ‌నివారం నాటికి భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 415కు చేరుకుంది. ఇందులో 115 మంది కోలుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.