న్యూడిల్లి:  తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన హత్యాచారం చాలా దారుణమైనదని మాజీ కేంద్ర మంత్రి, యూపీ ఎంపీ మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు. కానీ ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కూడా అత్యంత దారుణంగా ఎన్కౌంటర్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. శుక్రవారం తెల్లవారుజామున దిశ హత్యాచారం కేసులో నిందితులను  పోలీసుల కాల్పుల్లో చనిపోవడంపై ఆమె స్పందించారు. 

హైదరాబాద్ లో ఇవాళ ఉదయం జరిగిన సంఘటన చాలా భయంకరమైనదని, చట్టాన్ని అలా చేతుల్లోకి తీసుకోకూడదని ఏదేమైనా కోర్టులో చూసుకోవాల్సిందని అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎన్ కౌంటర్లు చేస్తే కోర్టులు, పోలీసులు, చట్టాలు ఎందుకున్నాయి అని మండిపడ్డారు.

''  ఏదయితే జరిగిందో అది చాలా భయంకరమైనది. మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వుండాల్సింది కాదు. వారు చట్టం చేతుల్లో తప్పకుండా ఉరిశిక్షకు గురయ్యి వుండేవారు. కానీ సరైన విచారణ జరక్కుండా వారిని శిక్షించడమంటే కోర్టులను గౌరవించకపోవడమే. ఇలా జరిగితే న్యాయ వ్యవస్థ, కోర్టులు వున్నదెందుకు. అలాగయితే తుపాకీ తీసుకుని ప్రతి ఒక్కరిని కాల్చి చంపవచ్చా'' అని  మాజీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మాట్లాడారు. 

DishaCaseAccusedEncounter : చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు మీకు లేదు...

తెలంగాణ వెటర్నరీ వైద్యురాలు దిశను గత నెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

read more  DishaCaseAccusedEncounter: దిశ ఘటనలో ప్రజలు కోరుకున్నదే జరిగింది: కేజ్రీవాల్

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.