కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా అంతర్రాష్ట్ర రవాణా నిలిచినపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేస్తున్నప్పటికీ అంతర్రాష్ట్ర రవాణాపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదివారం అంతర్రాష్ట్ర రవాణాపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేయాలని ఆదేశించారు.

వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదన్న అజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంక్షల కారణంగా ఆర్ధిక కార్యకలాపాలు, ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అజయ్ వ్యాఖ్యానించారు,