ఢిల్లీ: తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుపై చర్చ జరగగా 
ఇప్పట్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే ఆలోచన లేదని హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం తెలిపారు. 

2026 తర్వాతే పెంపు ఉంటుందని ప్రకటించారు. అసెంబ్లీ పెంపుపై తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం గెలుపొందడం, అధికారంలోకి రావడం కూడా జరిగిపోయింది. ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో అంతగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు.    

ఇకపోతే అసెంబ్లీ స్థానాలపెంపుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీడీపీలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. వారందరికి టిక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో సీట్లు పెరిగితే ఎలాగోలా సర్ధుకోవచ్చని భావించిన చంద్రబాబు ఆశలకు కేంద్ర హోంశాఖ నీళ్లు చల్లింది.