Asianet News TeluguAsianet News Telugu

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త...డీఏ, డీఆర్ పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు 2శాతం కరువు భత్యం(డీఏ), ఫించనుదారులకు డీఆర్‌ను పెంచుతూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డీఏ పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ పెంపు ద్వారా 48.41లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 62.03లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారని పేర్కొంది.

central Cabinet approves additional 2% hike in DA
Author
Delhi, First Published Aug 29, 2018, 3:02 PM IST

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు 2శాతం కరువు భత్యం(డీఏ), ఫించనుదారులకు డీఆర్‌ను పెంచుతూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డీఏ పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ పెంపు ద్వారా 48.41లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 62.03లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారని పేర్కొంది.

1 జూలై 2018 నుంచి ఈ పెంపు ఉద్యోగులకు వర్తించనుందని స్పష్టం చేసింది.  డీఏ పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ. 6,112.20కోట్లు, డీఆర్‌ పెంపు వల్ల రూ.4,074.80కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios