ఇక నుంచి ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్‌ అనుసంధానం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌లో ప్రకటన చేసింది. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది

ఇక నుంచి ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్‌ అనుసంధానం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌లో ప్రకటన చేసింది. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. తద్వారా ఇకపై ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో తెలుసుకునే వీలుంటుంది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు లోక్‌సభకు తెలిపారు.