Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ సోకిన నెల రోజుల్లో చనిపోతే అది కరోనా మరణమే.. కేంద్రం మార్గదర్శకాలు

కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం ఎవరైనా వ్యక్తి కరోనా సోకిన 30 రోజుల్లోగా చనిపోతే దానిని కరోనా మరణంగానే పరిగణించాలని పేర్కొంది. ఆసుపత్రిలో చనిపోయినా.. లేదా బయట చనిపోయినా కరోనా మరణంగానే గుర్తించాలని వెల్లడించింది

center fresh guidelines on covid deaths
Author
New Delhi, First Published Sep 12, 2021, 2:49 PM IST

కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)తో కలిసి ఆ మార్గదర్శకాలను రూపొందించామని సుప్రీంకోర్టుకు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 3నే ఆ మార్గదర్శకాలను విడుదల చేశామని, దాని ప్రకారం ఎవరైనా వ్యక్తి కరోనా సోకిన 30 రోజుల్లోగా చనిపోతే దానిని కరోనా మరణంగానే పరిగణించాలని పేర్కొంది.

Also Read:ఇండియాలో గత 24 గంటల్లో 28,591 కరోనా కేసులు: కేరళలోనే 20 వేలకుపైగా

ఆసుపత్రిలో చనిపోయినా.. లేదా బయట చనిపోయినా కరోనా మరణంగానే గుర్తించాలని వెల్లడించింది. ఇంట్లో లేదా ఆసుపత్రిలో చనిపోయి ఉండి.. ఇప్పటిదాకా స్పష్టత లేని కేసులనూ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ చట్టం ప్రకారం కరోనా మరణాలుగానే చూడాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అయితే కరోనా సోకిన వ్యక్తి యాక్సిడెంట్ లో లేదా విషం తాగి చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా కరోనా మరణంగా పరిగణించకూడదని తేల్చి చెప్పింది. కరోనా సోకిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ పై కుటుంబ సభ్యులకు అభ్యంతరాలుంటే.. జిల్లా స్థాయిలో కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని కేంద్రం సూచించింది
 

Follow Us:
Download App:
  • android
  • ios