గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, దేశంలో పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు తగ్గడం లేదని మండిపడ్డారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ రూపంలో కేంద్రం 7 ఏళ్లలో 23 లక్షల కోట్లను సంపాదించిందని ఆ డబ్బును సర్కార్ ఎటు మళ్లీస్తోందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 

గ్యాస్‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి గ్యాస్ ధరలు 116 శాతం పెరిగాయని.. దీని ప్రభావం దేశంలోని ప్రతి ఒక్కరిపై పడిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్ల ఉండేదన్న ఆయన.. ఇప్పుడు అది 74 డాలర్లే వుందని గుర్తుచేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, దేశంలో పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు తగ్గడం లేదని మండిపడ్డారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ రూపంలో కేంద్రం 7 ఏళ్లలో 23 లక్షల కోట్లను సంపాదించిందని ఆ డబ్బును సర్కార్ ఎటు మళ్లీస్తోందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. 

కాగా, గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో దేశంలోని లక్షలాది గృహాలపై దీని ప్రభావం పడనుంది. సబ్సిడీ లేని ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధర రూ. 25 పెరిగింది. ఇది బుధవారం (సెప్టెంబర్ 1, 2021) నుండే అమలులోకి వచ్చింది. కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర కూడా పెరిగింది. పెద్ద చమురు మార్కెటింగ్ పిఎస్‌యులు వీటిని ఒక్క సిలిండర్ మీద రూ .75 మేరకు పెంచాయి. 

Also Read:వంటగ్యాస్ మరింత ప్రియం.. సిలిండర్ ధరపై రూ.25 పెంపు.. హైదరాబాదులో వేయికి చేరువలో...

ఈ పెరిగిన ధరల ప్రకారం, ఒక నిండు సిలిండర్ అంటే 14.2 కిలోల సబ్సిడీ లేని ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ ధర ఇప్పుడు దేశ రాజధానిలో రూ. 884.50లకు లభిస్తుంది. దీనిప్రకారం కోల్‌కతాలో 14.2 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ .911కు చేరింది. హైదరాబాదులో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 912 రూపాయలు. సబ్సిడీయేతర LPG సిలిండర్ ధర ఆగస్టు 17 నుండి సిలిండర్‌పై రూ. 25 పెరిగింది. అంతకుముందు జూలై 1 న, సిలిండర్ ధర రూ. 25.50 పెరిగింది. ఎల్ పీజీ ధరలు గత ఏడు సంవత్సరాలలో రెట్టింపు అయ్యాయి. మార్చి 1, 2014 న రూ. 410.50 ధర ఉన్న సిలిండర్‌, ఇప్పుడు రూ. 859.50లకు చేరుకుంది. అంటే డబుల్ కంటే ఎక్కువ.

ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఇంటికి ఈ 14.2 కిలోల 12 సిలిండర్లు సబ్సిడీ కింద అందిస్తున్నారు. 12 రీఫిల్స్ వార్షిక కోటాపై ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తం ప్రతి నెలా మారుతుంది. గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేట్లను బట్టి వాటి హెచ్చుతగ్గులను బట్టి నిర్ణయించబడతాయి.