Asianet News TeluguAsianet News Telugu

ప్లాన్ ప్రకారం కేంద్రమే పుల్వామా, ఉరీ దాడులను చేపట్టింది - ఎన్‌సీ నేత షేక్ ముస్తఫా కమల్ సంచలన ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వమే 2016 ఉరీ దాడి, 2019 పుల్వామా దాడిని చేపట్టిందని జమ్మూ కాశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు షేక్ ముస్తఫా కమల్ ఆరోపించారు. ఆ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయింది అంతా ఎస్సీ వర్గాలకు చెందిన వారేనని అన్నారు. 

Center carried out Pulwama, Uri attacks as per plan - NC leader Sheikh Mustafa Kamal's sensational allegations
Author
First Published Jan 16, 2023, 4:58 PM IST

2016 ఉరీ దాడి, 2019 పుల్వామా దాడి రెండింటినీ కేంద్ర ప్రభుత్వమే ప్లాన్ ప్రకారం చేపట్టిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరుడు, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్ సీ) అదనపు ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా కమల్ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికీ సైనికుల ఫోటోలు, మృతదేహాలు లభించలేదని పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గాలకు చెందిన వారేనని తెలిపారు.

బంగాళాఖాతంలో చిక్కుకున్న 600 మంది గంగాసాగర్ యాత్రికులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

“అవి (దాడులు) భారత ప్రభుత్వమే ప్రణాళిక ప్రకారం చేసిందని ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు. మేము వారి ఫోటోలు, మృతదేహాలను చూడలేదు. ఆ 30-40 (సైనికులు) అందరూ ఎస్సీలు అని స్పష్టంగా తెలుస్తుంది ” అని ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు. ‘ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్’ ఏర్పాటు చేయాలన్న అబ్దుల్లా డిమాండ్‌ను ముస్తఫా కమల్ పునరుద్ఘాటించారు. జాతీయ స్థాయిలో విచారణ జరిపిన తర్వాత దాడుల వెనుక ఉన్న నిజానిజాలు వెల్లడవుతాయని చెప్పారు. ఎవరు బాధ్యులన్నది తేలేంత వరకు ఒకటి కాదు ఏకంగా ఐదు వేళ్లు భారత ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నాయని ఆరోపించారు.

భారత్ దేశంలో ఈ దశాబ్దపు అత్యంత భయంకరమైన ఉగ్రదాడులు 2016, 2019లో జరిగాయి. 2016 సెప్టెంబర్ 18న కశ్మీర్ లోని ఉరీలో సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసి 17 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే ఉగ్రవాదులు చేయడంతో 44 మంది జవాన్లను చనిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios