భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రూ. 8,000 కోట్లకు పైగా పరికరాలను కొనుగోలు చేసుందుకు రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. 

న్యూఢిల్లీ: భారత సైనిక పటిమను పెంపొందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ రూ. 8,000 కోట్లకు పైగా విలువైన ఆర్మీ శాటిలైట్, ఇతర పరికరాల కొనుగోలు చేయ‌నుంది. ఈ మేర‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగ‌ళ‌వారం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC), సాయుధ దళాల మూలధన సేకరణ ప్రతిపాదనలకు రూ. 8,357 కోట్లకు అవసరమైన అంగీకారాన్ని (AoN) ఆమోదించింది.

ఆత్మనిర్భర్ భారత్ కు ప్రేరణగా ఈ ప్రతిపాదనలన్నీ భారతదేశంలో స్వదేశీ డిజైన్, అభివృద్ధి, తయారీపై దృష్టి సారించాయి. ఇండియన్ IDDM కేటగిరీ కింద ఆమోదించారు. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ద్వారా అందించిన AoNలలో నైట్ సైట్ (ఇమేజ్ ఇంటెన్సిఫైయర్), లైట్ వెహికల్స్ gs 4x4, ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్ (లైట్), GSAT 7B ఉపగ్రహాల సేకరణ అంశాలు ఉన్నాయి. 

‘‘ ఈ పరికరాలు, వ్యవస్థల కొనుగోలు మెరుగైన దృశ్యమానత, మెరుగైన చలనశీలత, మెరుగైన కమ్యూనికేషన్, శత్రు విమానాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుతాయి. దీంతో సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధత మరింత మెరుగుపడుతుంది. ’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేందుకు పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్‌లో, iDEX స్టార్టప్‌లు, MSMEల నుండి రూ. 380.43 కోట్ల కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏకీకృత అంగీకారాన్ని అందించింది. 

దేశంతో త‌యారీని ప్రోత్స‌హించ‌డానికి రక్షణలో స్వయం విశ్వాసాన్ని సాధించడానికి, రక్షణ పరిశ్రమ కోసం వ్యాపారాన్ని సులభతరం చేయడానికి డీఏపీ - 2020 పాల‌సీలో భాగంగా పలు కార్య‌క్ర‌మాల‌ను అమలు చేయ‌డానికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇందులో రక్షణ దళాల అన్ని ఆధునీకరణ అవసరాలు స్వదేశీ మూలాలు ఉన్న‌వి మాత్ర‌మే దిగుమ‌తి చేసుకోవడానికి మిన‌హాయింపు ఉంటుంది. అలాగే రక్షణ పరిశ్రమపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, IPBG ఆవశ్యకతను తొలగించాలి. దీంతో పాటు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD)ని బిడ్ సెక్యూరిటీగా, కాంట్రాక్ట్ దశ వరకు PCIP కవర్‌గా ప్రవేశపెట్టాలి. ఎర్నెస్ట్ మ‌నీ డిపాసిట్ రూ. 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఉన్న ప్రతిపాదనలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే MSMEలు, స్టార్టప్‌ల‌కు EMD నుంచి మిన‌హాయింపులు ఉంటాయి.