CEC Sushil Chandra: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (EVM)లు భారత్‌కు గర్వకారణమని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) సుశీల్‌ చంద్ర తెలిపారు. EVMల‌ను ట్యాంపరింగ్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాధ్యం కాదని అన్నారు. శుక్ర‌వారం ఢిల్లీలోని బక్తావర్‌పూర్‌లో నిర్మించిన‌ ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ కాంప్లెక్స్‌ను సుశీల్‌ చంద్ర ప్రారంభించారు.   

CEC Sushil Chandra: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVM) సుర‌క్షిత‌మైన‌వ‌నీ, ఇవి భారతదేశానికి గర్వకారణమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర అన్నారు. వాటిని ట్యాంపరింగ్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. భార‌త దేశం ఎంతో వేగంగా, సకాలంలో, ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలను అందించగలదో తెలుసుకోవడానికి అనేక దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు. నేడు ఢిల్లీలోని బక్తావర్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ కాంప్లెక్స్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శుక్రవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సుశీల్‌ చంద్ర మాట్లాడారు. ఇప్పటివరకు నాలుగు పార్లమెంట్‌, ఇతర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా 350 కోట్ల మంది ఓటర్లు త‌మ‌ ఓటు హ‌క్కును వినియోగించుకున్నార‌ని తెలిపారు. దీని ఖచ్చితత్వానికి ఇదే నిదర్శనమని చెప్పారు. అందుకే ఈవీఎంలు దేశానికి ఎంతో గర్వకారణమని, ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని అన్నారు.

ఈవీఎం అనేది సింగిల్ చిప్ ప్రోగ్రామ్ అని సుశీల్‌ చంద్ర తెలిపారు. దీనిని ట్యాంపరింగ్‌ చేయలేరని, హ్యాకింగ్ ప్రశ్నే తలెత్తదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో VVPAT ఆడిట్ ట్రయల్ కూడా ఉంటుందన్నారు. దీంతో ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని వివరించారు. చాలా తక్కువ సమయంలో వేగంగా, ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలు భారత్‌లో ఎలా సాధ్యం అని పలు దేశాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు.

EVMలను ట్యాంపరింగ్ చేయ‌డం సాధ్యం కాద‌ని, EVM సింగిల్ చిప్ ప్రోగ్రామ్ మాత్రమేన‌నీ, ఫ్రీక్వెన్సీ లేదనీ.. కాబట్టి హ్యాకింగ్ ప్రశ్నే లేదని తెలిపారు. EVMలు అన్ని ఎన్నికలలో తమ పరీక్ష, విశ్వసనీయత ను చూపించాయని, నిర్దిష్ట విషయం దాటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో VVPAT ఆడిట్ ట్రయల్ కూడా ఉంటుంద‌న్నారు.

ఫలితాల యొక్క ఖచ్చితత్వం గురించి మాట్లాడుతూ.. యంత్రాలు లెక్కించబడి, కంట్రోల్ యూనిట్‌తో జత చేయబడి ఉన్నాయని, ఆడిట్ ట్రయల్‌ను లెక్కించేటప్పుడు ఈ యంత్రాలలో ఎటువంటి లోపం కనుగొనబడలేదని, ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని వివరించారు. చాలా తక్కువ సమయంలో వేగంగా, ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలు భారత్‌లో ఎలా సాధ్యం అని పలు దేశాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు.

అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే.. భార‌త్ లోనే ఎన్నిక‌ల ఫ‌లితాలు చాలా వేగంగా వెలువ‌డుతాయ‌నీ, ఇతర దేశంల్లో ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు దాదాపు వారం రోజుల సమయం తీసుకుంటాయ‌ని, గంటల వ్యవధిలోనే ఎన్నికల ఫలితాలను త్వరగా ఎలా అందజేస్తున్నామని ఇతర దేశాలు భారత్‌ను అడుగుతున్నాయని చంద్ర చెప్పారు. కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, వాటి పరీక్ష, విశ్వసనీయత రుజువు అవుతుంద‌ని తెలిపారు. 

కాగా, గత ఎన్నికల్లో ఢిల్లీలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైందని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. దేశ రాజధానిలో విద్యావంతులైన జనాభా ఉన్నప్పటికీ పోలింగ్‌ శాతం ఎందుకు తక్కువగా ఉంది? అని ప్రశ్నించారు. దక్షిణ ఢిల్లీలో కనీస ఓటింగ్ శాతం మాత్రమే నమోదైందని చెప్పారు. అస్సాంలో 80 శాతంపైగా ఓటింగ్ ఉంటే ఢిల్లీలో 62.5 శాతం ఎందుకు వచ్చిందో అన్నది పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

అంతకుముందు శుక్రవారం సిఇసి, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, సెక్రటరీ జనరల్ ఉమేష్ సిన్హా, ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రణధీర్ సింగ్‌తో కలిసి కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ కాంప్లెక్స్‌ను సందర్శించారు.

ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ కాంప్లెక్స్ అనేది ఢిల్లీలోని NCTలో EVMలు, VVPATల వేర్‌హౌజింగ్, నిర్వహణను ఆధునీకరించడానికి ఉద్దేశించిన మ‌ల్టీ-ఫంక్షనల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయం. కమీషన్ మార్గదర్శకాల ప్రకారం.. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్‌ఎల్‌సి) నిర్వహించడానికి కాంప్లెక్స్‌లో సమగ్ర సౌకర్యాలు ఉన్నాయి. FLC హాల్‌లను భారీ సమావేశాలు, శిక్షణా సమావేశాలకు కూడా ఉపయోగించవచ్చు. ఇది ప్రజాస్వామ్యంపై మనకున్న సామూహిక విశ్వాసానికి మహోన్నతమైన నిదర్శనమ‌ని చంద్ర తెలిపారు. 

ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతత, అవగాహన చాలా కీలకమని, అందువల్ల ఈవీఎంల క్రమబద్ధమైన నిల్వ, నిర్వహణ, తరలింపు కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, చెక్‌లిస్ట్ అనుసరించడం చాలా కీలకమని ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే ప్రసంగించారు.