Asianet News TeluguAsianet News Telugu

సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ రాజీవ్ కుమార్

సార్వత్రి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.

CEC Rajeev Kumar releases general election schedule..ISR
Author
First Published Mar 16, 2024, 3:36 PM IST

అతి పెద్ద ప్రజాసామ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగింది. లోక్ సభ ఎన్నికల 2024 కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సాయంత్రం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. 

లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేస్తున్నట్టు రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్టు ఆయన వెల్లడించారు. 

అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.08 కోట్ల మంది కొత్త ఓటర్లను ఉన్నారని అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారి జాబితా కూడా తమ వద్ద ఉందని చెప్పారు. ఏప్రిల్ 1 తరువాత వారిక ఓటు హక్కు ఇస్తామని తెలిపారు.

కాశ్మీర్ కు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని రాజీవ్ కుమార్ అన్నారు. ప్రతీ ఎన్నికలు తమకు పాఠాన్ని నేర్పుతున్నాయని తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పని చేస్తారని అన్నారు. దేశంలో 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ లో టాయిలెట్ సౌకర్యంతో పాటు మంచినీళ్లను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ప్రతీ స్టేషన్ లో వీల్ చైర్ కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios