Asianet News TeluguAsianet News Telugu

army chopper crash: సీడీఎస్‌గా జనవరితో ముగియనున్న బిపిన్ రావత్ పదవీకాలం.. అంతలోనే

తమిళనాడులో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (cds bipin rawat ) ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన (army helicopter crashed)  సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రావత్ పరిస్థితి విషమంగా వుండగా.. ఆయన భార్య మధులికా రావత్ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

cds general bipin rawat will retire next year january
Author
New Delhi, First Published Dec 8, 2021, 3:22 PM IST

తమిళనాడులో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (cds bipin rawat ) ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన (army helicopter crashed)  సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రావత్ పరిస్థితి విషమంగా వుండగా.. ఆయన భార్య మధులికా రావత్ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా బిపిన్ రావత్ 2019, జ‌న‌వ‌రిలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. త్రివిధ దళాల (వాయుసే, ఆర్మీ, నౌకాద‌ళం) తొలి అధిపతిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన బిపిన్ రావ‌త్ మూడేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఇక ఆయ‌న ప‌ద‌వీకాలం 2022, జ‌న‌వ‌రితో ముగియ‌నుంది. అంత‌లోనే ఈ దుర్ఘటనన జ‌ర‌గ‌డంతో భారత సాయుధ దళాలు ఉలిక్కిపడ్డాయి.  గతంలో మూడేళ్లపాటు ఆర్మీ చీఫ్‌గా పని చేసిన బిపిన్ రావత్.. 2019, జ‌న‌వ‌రిలో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అంతకు ముందే ఆయన్ను దేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

Also Read:Army Helicaptor Crash: సిడిఎస్ బిపిన్ రావత్ పరిస్థితి విషమం, భార్య మృతి..?

త్రివిధ దళాలకు చెందిన చిహ్నాలను ఆయన యూనిఫాం మీద పొందుపరిచారు. మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తూ... రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్‌గా సీడీఎస్ వ్యవహరిస్తున్నారు. అంతేకాదు మనదేశంలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి ఆయనే.. లఢఖ్ సంక్షోభ సమయంలో బిపిన్ రావత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాదు భారత రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు రావత్ మార్గదర్శి.. దేశంలో త్రివిధ దళాలకు వేర్వేరు చోట్ల వున్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే అత్యంత కీలకమైన బాధ్యత ఆయనదే. 

కాగా.. తమిళనాడు (tamilnadu) రాష్ట్రం కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో బుధవారం ఈ చాపర్ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గుర్ని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని భారత వాయుసేన కూడా ధ్రువీకరించింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. 

హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న వారి వీరే:

  • జనరల్ బిపిన్ రావత్
  • శ్రీమతి మధులికా రావత్
  • హరీందర్ సింగ్
  • గురు సేవక్ సింగ్
  • జితేంద్ర కుమార్
  • వివేక్ కుమార్
  • సాయి తేజ
  • సత్పత్
Follow Us:
Download App:
  • android
  • ios