Asianet News TeluguAsianet News Telugu

CDS Gen Bipin Rawat: బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించిన Mi-17V-5 హెలికాప్టర్ ప్రత్యేకత‌లివే..!

CDS Gen Bipin Rawat: తమిళనాడు రాష్ట్రంలోని నీల‌గిరి అడ‌వుల్లో కూనురు వ‌ద్ద ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన‌ట్లు స‌మాచారం.  ఈ హెలికాప్టర్‌లో త్రివిధ ద‌ళాధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావత్ తో పాటు మరో 14 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్న‌ట్టు స‌మాచారం. ఘ‌టనపై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరికొద్దిసేపట్లో పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌మాదానికి గురైన హెలికాప్ట‌ర్ ప్ర‌త్యేక‌తలు చ‌ర్చ‌నీయంగా మారాయి.
 

CDS Gen Bipin Rawat helicopter crash: All you need to know about IAF's Mi-17V5 chopper
Author
Hyderabad, First Published Dec 8, 2021, 5:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భార‌త‌ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావత్ (CDS Gen Bipin Rawat), ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులతో క‌లిసి ప్ర‌యాణిస్తున్న ఆర్మీ హెలిక్యాప్ట‌ర్ Mi-17V-5 తమిళ‌నాడులోని నీలగిరి కొండ‌ల్లో ఈ మ‌ధ్యాహ్నం కుప్ప‌కూలింది. ఆ వెంట‌నే హెలికాప్ట‌ర్ నుంచి మంట‌ల చెల‌రేగాయి. స్థానికుల‌ స‌మాచారం అందుకు వెంట‌నే రంగంలో స‌హాయ‌క సిబ్బంది రంగంలోకి దిగారు.  ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో బిపీన్ రావత్ కుటుంబ సభ్యులతో స‌హా 14 మంది ప్ర‌యాణించిన‌ట్టు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది.

ఇప్ప‌టివ‌ర‌కూ 11 మంది మృతి చెందిన‌ట్టు స‌మాచారం. మృతుల్లో బిపిన్ రావ‌త్ స‌తీమ‌ణి ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రో ముగ్గురు ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. వారిలో బిపిన్ రావ‌త్ కుడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ఆరోగ్య‌ప‌రిస్థితిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మాదానికి గురైన హెలికాప్ట‌ర్ ప్ర‌త్యేక‌త‌లు చ‌ర్చ‌నీయంగా మారాయి.


Mi-17V-5  హెలికాప్ట‌ర్ ప్ర‌త్యేక‌తలివే: 

- ప్ర‌మాదానికి గురయిన ఆర్మీ విమానం పేరు Mi-17V-5 . Mi-8/17 కుటుంబానికి చెందిన మిలిట‌రీ ర‌వాణా విమానం. 
- ర‌ష్యన్ హెలికాప్టర్స్ స‌బ్సిడ‌రీ అయిన క‌జాన్ హెలికాప్ట‌ర్స్ దీనిని రూపొందించారు. ఈ హెలిక్యాప్ట‌ర్ లోప్ర‌పంచంలోనే అత్యాధునిక ర‌వాణా వ్య‌వ‌స్థ ఉంటుంది. 

- ఈ  హెలికాప్ట‌ర్‌ల‌ను ప్ర‌ధాన రెస్క్యూ ఆప‌రేష‌న్ల‌లో వాడుతారు. భ‌ద్ర‌తాబ‌లాగాల ర‌వాణా, అగ్నిప్ర‌మాదాల స‌మ‌యంలో ఈ హెలికాప్ట‌ర్ల‌ను వాడుతారు. అలాగే.. కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్ స‌మయాల్లో వీటిని 
వినియోగిస్తారు. 

- ఈ హెలికాప్ట‌ర్ల‌లో 39 మంది ప్రయాణించవచ్చు. 

- ఈ హెలికాప్ట‌ర్లో  FLIR సిస్టంతో పాటు అత్యవసర సమయాల్లో సహకరించే ఫ్లోటేషన్‌ సిస్టమ్స్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ హెలికాప్ట‌ర్ సుమారు 4, 500 కిలోల బ‌రువును తీసుకెళ్ల‌గ‌ల‌దు.  

- హెలికాప్టర్‌లో పోర్ట్ స్లైడింగ్ డోర్, పారాచూట్ కిట్, సెర్చ్‌లైట్ వంటి అత్య‌వసర పరికరాలు ఉన్నాయి.

-Mi-17V5 హెలికాప్టర్ గరిష్ట వేగం గంటకు 250 కి.మీ నుంచి 580 కి.మీ. అలాగే గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ఎగుర‌గ‌ల‌దు. 

- అన్ని ర‌కాల వాతావర‌ణ ప‌రిస్థితుల‌ల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చు 
   
-Shturm-V క్షిపణులు, S-8 రాకెట్లు, ఒక మెషిన్ గన్, PKT మెషిన్ గన్లు, AKM జలాంతర్గామి ఆయుధాలు అన్నీ ఛాపర్‌లో ఉన్నాయి. 
 
2013 ఫిబ్ర‌వ‌రి నుంచి  Mi-17V-5 హెలికాప్ట‌ర్లను వాడుతోంది ర‌క్ష‌ణ శాఖ‌. తొలుత ఎరో ఇండియా ఎయిర్ షో చూసి.. 12 హెలికాప్ట‌ర్ల‌ను ఆర్డ‌ర్ చేసింది ఇండియ‌న్ ఆర్మీ. ర‌ష్యన్ హెలిక్యాప్ట‌ర్స్ నుంచి మొత్తం 80 హెలికాప్టర్ల కొనుగోలు కోసం భార‌త ర‌క్ష‌ణ శాఖ 2008 డిసెంబ‌ర్‌లో 1.3 బిలియ‌న్ డాల‌ర్ల ఒప్పందం చేసుకుంది. ఈ ఎంవోయూలో భాగంగానే ర‌ష్యన్‌ హెలికాప్టర్స్‌ 2011 నుంచి హెలికాప్టర్లను భారత్‌కు అందజేస్తోంది. ఇలా 2013 ప్రారంభం వ‌ర‌కు మొత్తం 36 హెలికాప్టర్లు భారత్ లో అడుగుపెట్టాయి. అలాగే.. 2012-13 మ‌ధ్యకాలంలో 71 Mi-17V-5 హెలికాప్టర్ల కొనుగోలు కోసం భార‌త ర‌క్షణ శాఖ‌, రొసొబ‌రోనెక్స్‌పోర్ట్ మ‌ధ్య ఒప్పందం కుదిరింది. అయితే Mi-17V-5 హెలికాప్టర్ల రిపేరింగ్, సర్వీసింగ్‌ సేవలను భార‌త వాయుసేన 2019 ఏప్రిల్‌లో ప్రారంభించింది.


Mi-17V-5 జ‌రిగిన ప్ర‌మాదాలివే..

-MI17 V5లో ఎన్నో ఆధునిక సదుపాయాలు, అత్యంత ఆధునిక రక్షణ సౌలభ్యాలున్నా అప్పుడప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

- 2019,  అక్టోబర్27, 2019..  కేదార్‌నాథ్‌లోని ఎత్తైన ప్రాంతంలో ప్ర‌మాదం జ‌రిగింది.

-  2018 ఏప్రిల్ 3న MI17 V5 5 ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదవశాత్తూ ఐరన్ రాడ్‌ను ఢీకొని కుప్పకూలింది. 

- 2016 అక్టోబర్‌ 19న  ఓ శిక్షణ కార్యక్రమంలో MI17 V5 ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ప్ర‌మాద‌స‌మ‌యంలో  15 మంది ఉన్న ఎవ్వ‌రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

- 2013 జూన్ 25న  సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న MI17 V5 సాంకేతిక కార‌ణాల‌తో కుప్పకూలింది. 
ఈ ప్ర‌మాదంలో మొత్తం 20 మంది దుర్మరణం పాలయ్యారు.

- 2012 ఆగస్టు 30న  రెండు MI17 విమానాలు ఢీకొని మొత్తం 9 మంది మృత్యువాత పడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios