ఎంఐఎం (aimim) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) వాహనంపై యూపీలో (uttar pradesh) కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. తన వాహనంపై మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్ వెల్లడించారు. కాల్పులకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. 

ఎంఐఎం (aimim) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) వాహనంపై యూపీలో (uttar pradesh) కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. తన వాహనంపై మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్ వెల్లడించారు. సురక్షితంగా బయటపడిన ఆయన.. కాల్పుల ఘటన విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు. మీరట్ జిల్లా (meerut) కిట్టోర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అసదుద్దీన్.. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి (new delhi) వెళ్తుండగా.. ఛాజర్సీ టోల్‌ప్లాజా వద్ద అసద్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. టోల్‌ప్లాజా వద్ద ఇద్దరి నుంచి ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపి ఆయుధాలను అక్కడే వదిలేసి పరారయ్యారని అసద్ తెలిపారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఢిల్లీ చేరుకున్న తర్వాత అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. తన కారుపై కాల్పుల ఘటనలో ఓ షూటర్‌ని అరెస్ట్ చేసి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తనకు సమాచారం ఇచ్చారని అసద్ వెల్లడించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు చెప్పారు. స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిన బాధ్యత యూపీ , కేంద్ర ప్రభుత్వాలదేనని అన్నారు. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలుస్తానని అసుదుద్దీన్ తెలిపారు. 

ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుని, ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. అతనితో పాటు వున్న మరో వ్యక్తి పరారీలో వున్నాడని పోలీసులు పేర్కొన్నారు. కాల్పులకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.