ఆసుపత్రుల్లోని ఐసీయూ గదుల్లోని గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య, ఐసీయూలో గడిపే సమయాన్ని బట్టి గాలిలో వైరస్ వుంటుందని అన్నారు.

హైదరాబాద్‌తో పాటు మొహాలీలో సీసీఎంబీ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. అయితే కరోనా విషయంలో ఆందోళన అక్కర్లేదన్నారు. మాస్క్ ధరించడం భౌతిక దూరం వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని గుర్తించామని చెప్పారు.