Asianet News TeluguAsianet News Telugu

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: ఫస్ట్ ప్లేస్‌లో హన్సిక, కరీష్మా

సీబీఎస్ఈ ఫలితాలను గురువారం సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 83.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

cbse class 12 results released
Author
New Delhi, First Published May 2, 2019, 3:00 PM IST

సీబీఎస్ఈ ఫలితాలను గురువారం సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 83.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికల ఉత్తీర్ణతా శాతం 88.70 శాతం ఉండగా.. బాలుర ఉత్తీర్ణతా శాతం 79.4 శాతంగా నమోదైంది.

కాగా.. ట్రాన్స్‌జెండర్ విద్యార్ధుల్లో 83.3 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీబీఎస్ఈ ఫలితాల్లో ఈ ఏడాది ఇద్దరు అమ్మాయిలు సంయుక్తంగా మొదటి ర్యాంక్ సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, ముజఫర్‌నగర్‌కు చెందిన కరీష్మా అరోరా 500 మార్కులకు గాను 499 మార్కులు సాధించారు.

గతేడాది ఘజియాబాద్‌కే చెందిన అమ్మాయే టాపర్‌గా నిలవడం విశేషం. ఈ ఏడాది సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి మొత్తం 31,14,821 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

దాదాపు 12 లక్షల  మంది విద్యార్ధులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరికి ఫిబ్రవరి- మార్చి మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 4,974 పరీక్షా కేంద్రాల్లో, విదేశాల్లో 78 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు  నిర్వహించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios