Asianet News TeluguAsianet News Telugu

జూలై 31లోపుగా సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: సుప్రీంకి నివేదిక

సుప్రీంకోర్టుకు  12వ తరగతి విద్యార్ధులకు మార్కులు కేటాయించే ప్రణాళికను సీబీఎస్ఈ గురువారం నాడు అందించింది. కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది బోర్డు. 

CBSE class 12 Results by July 31 lns
Author
New Delhi, First Published Jun 17, 2021, 11:52 AM IST

న్యూఢిల్లీ:సుప్రీంకోర్టుకు  12వ తరగతి విద్యార్ధులకు మార్కులు కేటాయించే ప్రణాళికను సీబీఎస్ఈ గురువారం నాడు అందించింది. కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది బోర్డు.  పరీక్లలు నిర్వహించకుండా విద్యార్థులకు మార్కులు కేటాయించే విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు ఇవాళ సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించింది. 

&

nbsp;

 

సీబీఎస్ఈ 12 విద్యార్థులకు మార్కుల కేటాయింపు విషయంలో ఏర్పాటు చేసిన 13 మంది సభ్యుల కమిటీ సిఫారసుల ఆధారంగా  మార్కుల కేటాయింపు విషయాన్ని సుప్రీంకోర్టుకు బోర్డు అందించింది. మార్కుల కేటాయింపు విషయమై ఏ రకమైన ప్రణాళికను అనుసరిస్తారనే విషయాన్ని రెండు వారాల్లో తమకు అందించాలని సుప్రీంకోర్టు గతంలో సీబీఎస్ఈని ఆదేశించింది.

10వ తరగతి, 11వ తరగతుల్లో వచ్చిన  మార్కుల ఆధారంగా 12వ తరగతిలో విద్యార్ధులకు మార్కులను కేటాయించనున్నారు. 30+30+40  ప్రణాళికతో 12వ తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించనున్నారు. ఈ ఏడాది జూలై 31 లోపుగా ఫలితాలను విడుదల చేస్తామని సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ ప్రణాళికకు ఉన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. మరో వైపు పరీక్షలు రాయాలనుకొనే విద్యార్థులకు కూడ అవకాశం కల్పిస్తామని సీబీఎస్ఈ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios