గుడ్‌న్యూస్: జూలై 15 లోపుగా సీబీఎస్ఈ 10,12 తరగతుల ఫలితాలు
ఈ ఏడాది జూలై 15వ తేదీలోపుగా సీబీఎస్ఈ టెన్త్ , 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేయనుంది. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ విడుల చేసింది.
న్యూఢిల్లీ:ఈ ఏడాది జూలై 15వ తేదీలోపుగా సీబీఎస్ఈ టెన్త్ , 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేయనుంది. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ విడుల చేసింది.
కరోనా నేపథ్యంలో పెండింగ్ లోని టెన్త్, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ఈ నెల 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసు విచారణను ఇవాళ కూడ సుప్రీంకోర్టులో సాగింది. అంతర్గత మార్కుల ఆధారంగా ఫలితాలను విడుదల చేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.
సీబీఎస్ఈ సమర్పించిన అసెస్‌మెంట్ మార్కుల స్కీమ్ కు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది. జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజివ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది.
సీబీఎస్ఈ కోర్టుకు సమర్పించిన అసెస్‌మెంట్ స్కీమ్‌ను అంగీకరించింది. పెండింగ్ పరీక్షలకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా మార్క్‌లు వేసి ఈ ఏడాది జూలై 15వ తేదీలోగా తుది ఫలితాలను సీబీఎస్ఈ బోర్డు రిలీజ్ చేయనుంది.
ఇప్పటికే పూర్తైన బోర్డు పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి సబ్జెక్టులకు కూడ మార్కులను కేటాయించనుంది. అసలు ఏ పరీక్షలు రాయని విద్యార్థులకు మాత్రం అసెస్ మెంట్, గతంలో నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షలు, ప్రాజెక్టుల మూల్యాంకనం ద్వారా మార్కులను కేటాయిస్తారు.
టెన్త్ క్లాస్ విద్యార్ధులకు ఇప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకొనే అవకాశం లేదు.12 తరగతి విద్యార్థులకు మాత్రం ఇప్రూవ్ మెంట్ పరీక్షలు రాసుకొనే అవకాశం కల్పించింది బోర్డు.
సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు గత ఫిబ్రవరి 15న ప్రారంభం కాగా లాక్‌డౌన్ కారణంగా మధ్యలోనే ఆగిపోయాయి. 10వ తరగతి పరీక్షలు కూడా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు నిర్వహించాల్సి ఉంది.
also read:కరోనా దెబ్బ:సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు
అయితే మార్చి 18వరకు సీబీఎస్ఈ పరీక్షలు జరిగాయి. మిగిలిన పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు కలిగాయి. పెండింగ్ లోని పరీక్షలను ఈ ఏడాది జూలైలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, జూలైలో కూడ ఈ పరీక్షలు నిర్వహించలేమని పలు రాష్ట్రాలు చేతులెత్తయడంతో సీబీఎస్ఈ ఈ పరీక్షలను రద్దు చేసింది.